ప్రభుత్వరంగ SBI క్రెడిట్ కార్డ్ విభాగం ఎస్బీఐ కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ మొత్తం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(NPA) సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 4.3 శాతానికి పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో 2.3 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో ఎస్బీఐ కార్డ్ రూ.206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదు చేసిన నికర లాభం రూ.381 కోట్లతో పోలిస్తే 46 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.2,376 కోట్ల నుండి ఆరు శాతం పెరిగి రూ.2,513 కోట్లుగా నమోదయింది.

పెరిగిన నిరర్థక ఆస్తులు
ఎస్బీఐ కార్డ్ సంస్థలో 2020-21 రెండో క్వార్టర్ నాటికి 1.1 కోట్ల క్రెడిట్ కార్డులు మనుగడలో ఉన్నాయి. ఏడాది క్రితం 95 లక్షల క్రెడిట్ కార్డులు ఉండగా, ఈసారి 16 శాతం పెరిగాయి. అయితే వీటి ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు మాత్రం 10.8 శాతం తగ్గింది. గత ఏడాది రూ.33,176 కోట్లు వ్యయం ఉండగా, ఈసారి రూ.29,590 కోట్లుగా ఉంది. కంపెనీ వడ్డీ ఆదాయం రూ.1,162 కోట్ల నుండి 9.7 శాతం పెరిగి రూ.1275 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు 2.3 శాతం నుండి 4.3 శాతానికి పెరిగాయి.

వేతనజీవులే ఎక్కువ
ఎస్బీఐ కార్డ్ కస్టమర్లలో 84 శాతం మంది వేతనజీవులు. ఇందులో 38 శాతం మంది పబ్లిక్ సెక్టార్, 24 శాతం మంది పెద్ద కార్పోరేట్ సెక్టార్‌లో ఉన్నారు. ఎస్బీఐ కార్డ్ ఫలితాల నేపథ్యంలో ఈ రోజు ఈ స్టాక్ 5.51 శాతం క్షీణించి రూ.805 వద్ద ముగిసింది. ఎస్బీఐ కార్డ్ మొత్తం స్థూల రుణాలు రూ.23,038 కోట్ల నుండి స్వల్పంగా పెరిగి రూ.23,978 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ బ్యాలెన్స్ షీట్ రూ.24,313 ోట్లు ఉండగా, నికర వ్యాల్యూ రూ.5,949 కోట్లుగా ఉంది.

98 శాతం కరోనా ముందుస్థాయికి
రోజువారీ కొత్త కార్డుల జారీ కరోనా ముందున్న పరిస్థితులకు సమీపంలో 98 శాతంగా ఉన్నట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. రిటైల్ వ్యయాలు క్వార్టర్ ప్రాతిపదికన 50 శాతం పెరిగాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నుండి ఆర్థిక కార్యకలాపాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రంగాలపై, కంపెనీలపైప్రభావం పడింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications