For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ బ్రాంచీలు క్లోజ్ చేస్తారా, ఈ-కార్నర్స్ తీసుకు వస్తారా? ప్రభుత్వం ఏం చెబుతోంది

|

ప్రభుత్వరంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (SBI) కేంద్ర ప్రభుత్వం మూసివేయనుందా? దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీలను క్లోజ్ చేసి వాటి స్థానంలో ఈ-కార్నర్స్‌ను తీసుకు వస్తుందా? దీనిపై కేంద్రం స్పందించింది. దేశంలోని ఎస్బీఐ బ్రాంచీలను క్లోజ్ చేసే ఆలోచన లేదని, అలాగే కస్టమర్లకు మరింత సులువైన సేవల కోసం ఈ-కార్నర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

మందగమనంలోను సాఫ్టువేర్ అదుర్స్, మొత్తం 43.6 లక్షల ఉద్యోగాలు, కానీ హెచ్చరిక..!మందగమనంలోను సాఫ్టువేర్ అదుర్స్, మొత్తం 43.6 లక్షల ఉద్యోగాలు, కానీ హెచ్చరిక..!

బ్రాంచీలు మూసివేయడం లేదు

బ్రాంచీలు మూసివేయడం లేదు

ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు రాతపూర్వకంగా వెల్లడించారు. SBI ప్రస్తుత సిబ్బంది 2.5 లక్షల మంది ఉన్నారని, మార్చి 2021 నాటికి ఈ సంఖ్యను తగ్గించే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. అలాగే, అన్ని బ్రాంచీలను మూసివేసి, వాటి స్థానంలో మాత్రమే ఈ-కార్నర్స్ తీసుకు వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పారు. ఇది బ్యాంకు అందరికీ ఊరట కలిగించే అంశం.

బ్రాంచీల మూసివేత, ఉద్యోగుల తగ్గింపుపై ప్రశ్న

బ్రాంచీల మూసివేత, ఉద్యోగుల తగ్గింపుపై ప్రశ్న

SBI బ్రాంచీలను అన్నింటిని మూసివేసి, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ-కార్నర్స్‌ను తీసుకు వస్తుందా? అని పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం చెప్పారు.

ఉద్యోగుల తొలగింపుపై ప్రశ్న

ఉద్యోగుల తొలగింపుపై ప్రశ్న

అంతేకాదు, 2021 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 16 లక్షల మంది ఉద్యోగులను తగ్గించాలని కేంద్రం భావిస్తుందా అని ప్రశ్నించారు. దీనికి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. కాగా, ఎస్బీఐ ఉద్యోగులు 2.5 లక్షల మంది ఉన్నారని, వారిని వచ్చే ఏడాదికి తగ్గించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసారు.

English summary

ఎస్బీఐ బ్రాంచీలు క్లోజ్ చేస్తారా, ఈ-కార్నర్స్ తీసుకు వస్తారా? ప్రభుత్వం ఏం చెబుతోంది | SBI branches to be shut down?: what government says

The central government has no plans to shut down branches of State Bank of India across the country and substitute them with e-corners.
Story first published: Thursday, February 13, 2020, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X