For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Alert! గడువులోగా ఇది పూర్తి చేయాలి, లేదంటే ట్రాన్సాక్షన్స్‌పై ప్రభావం

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు అలర్ట్. ఈ మేరకు ఇప్పటికే తన కోట్లాదిమంది కస్టమర్లకు సందేశాలు పంపించింది. పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ తేదీ త్వరలో ముగుస్తుందని పేర్కొంది. మార్చి 31, 2022 తేదీ లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని ఎస్బీఐ సూచించింది. గడువులోగా జత చేయకుంటే బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పైన ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది.

ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ కస్టమర్లు తప్పనిసరిగా ఆధార్-పాన్‌ను లింక్ చేయాలని పేర్కొంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాంకింగ్ సేవలను కొనసాగించేలా తమ కస్టమర్లు వారి ఆధార్ కార్డుకు పాన్ కార్డును జత చేయాలని సూచిస్తున్నామని, నిర్దిష్ట గడువు లోగా లింక్ చేయకుంటే ఎస్బీఐ ట్రాన్సాక్షన్స్ పైన ప్రభావం చూపుతుందని పేర్కొంది.

SBI Alert! Banking services will soon stop if you fail to do this

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎస్బీఐ పాన్-ఆధార్ లింకింగ్ గడువును సెప్టెంబర్ 30, 2021 నుండి మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్ వెబ్ సైట్ ద్వారా పాన్-ఆధార్ లింక్ చేయవచ్చు. ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లి లింక్ ఆధార్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన పాన్-ఆధార్ వివరాలు అందించాలి. కాప్చా కోడ్ ఎంటర్ చేసి లేదా ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. లింక్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. 567678/ 56161 ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా కూడా లింక్ చేయవచ్చు.

English summary

SBI Alert! గడువులోగా ఇది పూర్తి చేయాలి, లేదంటే ట్రాన్సాక్షన్స్‌పై ప్రభావం | SBI Alert! Banking services will soon stop if you fail to do this

Crores of SBI customers have been alerted all over India about the crucial PAN-Aadhaar card linking deadline of March 31, 2022.
Story first published: Monday, February 7, 2022, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X