For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యా-సౌదీ క్రూడాయిల్ పోరు, భారత్‌కు ఎలా, ఎందుకు లాభమంటే?

|

సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో తన అరబ్ లైట్ ముడి క్రూడాయిల్ ధరను తగ్గించినట్లు ప్రకటించింది. గురువారం ఒపెక్ దేశాలు సమావేశమై చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. అయితే ఒపెక్ దేశాలతో పాటు చమురు ఉత్పత్తిలో అతిపెద్ద దేశమైన రష్యా దీనికి అంగీకరించలేదు. దీంతో సౌదీకి ఇబ్బందికరంగా మారింది. చమురు బ్యారెల్‌కు 83 డాలర్ల ధర లభిస్తేనే ఆ దేశ బడ్జెట్ అంచనాలను అందుకుంటుంది. చమురు బ్యారెల్ ధర 43 డాలర్ల కంటే తగ్గితే రష్యా కూడా ఇబ్బందులు పడుతుంది. రష్యా అంగీకరించనందున చమురు ఉత్పత్తి పెంచి ధరలు తగ్గించనుంది సౌదీ.

కరోనా ఎఫెక్ట్: రష్యాతో చమురు యుద్ధం, భారీగా పడిపోయిన సౌదీ ఆరామ్‍‌కో షేర్లుకరోనా ఎఫెక్ట్: రష్యాతో చమురు యుద్ధం, భారీగా పడిపోయిన సౌదీ ఆరామ్‍‌కో షేర్లు

ఆ పోరు భారత్, చైనాకు వరం

ఆ పోరు భారత్, చైనాకు వరం

భారత్ అభివృద్ధిని వాణిజ్య లోటును క్రూడాయిల్ శాసిస్తోంది. చమురు ధర పెరిగితే భారత్‌కు నష్టం. ధర తగ్గితే లాభం. ఇప్పటికే ఆర్థిక మందగమనం కారణంగా భారత జీడీపీ తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ/ఒపెక్ దేశాలు-రష్యా పోరు భారత్‌కు ఓ వరమే అంటున్నారు. భారత్‌తో పాటు చైనాకు కూడా ప్రయోజనమే.

రష్యాకు చెక్

రష్యాకు చెక్

ఒపెక్ దేశాలు, రష్యా క్రూడాయిల్ పోరు కారణంగా బ్యారెల్ చమురు ధరలు తగ్గుతున్నాయి. వీటి ధర 46 డాలర్లకు దిగి వచ్చే అవకాశముంది. ఒపెక్‌లో సౌదీదే హవా. రష్యా చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు నో చెప్పడంతో ఉత్పత్తిని భారీగా పెంచి ధరలు తగ్గించాలని సౌదీ భావిస్తోంది. తద్వారా రష్యాకు చెక్ చెప్పాలని చూస్తోంది.

భారత్‌కు ఎలా లాభమంటే

భారత్‌కు ఎలా లాభమంటే

వారి మధ్య పోరు భారత్, చైనా వంటి దేశాలకు కలిసి వస్తుంది. ఈ రెండు దేశాలు చమురు నిల్వలు పెంచుకునేందుకు సౌదీ నిర్ణయం ఉపకరిస్తుందని చెబుతున్నారు. 2018-19లో భారత్ 207 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది. నాడు ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు బ్యారెల్ ధర 46 డాలర్లకు తగ్గింది. బ్యారెల్ ధర తగ్గిన నేపథ్యంలో భారత్‌కు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.

English summary

రష్యా-సౌదీ క్రూడాయిల్ పోరు, భారత్‌కు ఎలా, ఎందుకు లాభమంటే? | Saudi Arabia slashes April crude oil prices, effect on India and China

State oil giant Saudi Aramco has set its Arab light crude oil to Asia for April at a discount of $3.10 to the Oman/Dubai average, down $6 a barrel from March, the company said in a statement late on Saturday.
Story first published: Sunday, March 8, 2020, 17:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X