For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Samsung: ఆ స్మార్ట్‌ఫోన్లను మడత పెట్టేయొచ్చు: లాంచ్ డేట్..రేటు ఇదే

|

సియోల్: స్మార్ట్‌ఫోన్లు కొత్త రూపాన్ని సంతరించుకోబోతోన్నాయ్. ఇప్పటిదాకా ఫ్లాట్‌గా ఉంటూ వచ్చిన స్మార్ట్‌ఫోన్ల రూపం ఇక మారబోతోంది. మరింత సౌకర్యంగా ఉండబోతోన్నాయి. పాకెట్ ఇమిడిపోయేలా వాటిని తయారు చేసింది శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ యాజమాన్యం. స్మార్ట్‌ఫోన్లను మడతపెట్టడానికి వీలుగా తయారు చేసిన రెండు కొత్త మోడళ్లను త్వరలో మార్కెట్‌లో విడుదల చేయనుంది. దీనికి ముహూర్తాన్ని పెట్టేసింది. మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో టాప్‌ప్లేస్‌లో కొనసాగుతోన్న శాంసంగ్ తన పరిధిని మరింత విస్తృతం చేసుకోనుంది.

మరోసారి ఫోల్డబుల్‌, ఫ్లిప్‌ మోడళ్లను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ కంటే ముందు.. ఫోల్డబుల్ ఫోన్లను పరిచయం చేసింది కూడా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీయే. దాన్ని స్మార్ట్‌ఫోన్లకూ విస్తరింపజేసింది. గెలాక్సీ సిరీస్‌లోనే కొత్త ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్లను తయారు చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 (Galaxy Z Fold3), గెలాక్సీ జెడ్ ఫ్లిప్3 (Galaxy Z Flip3) మోడళ్లను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఆగస్టు 11వ తేదీన ఈ రెండు మోడళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. ఎస్ పెన్ సపోర్ట్‌తో అవి పని చేసేలా తయారు చేసినట్లు తెలుస్తోంది.

Samsung Electronics is expected to announce of folded smartphones on August 11.

ఈ రెండింటితో పాటు కొన్ని విడి పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను రూపొందించడం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తేమీ కాదు గానీ.. వాటి రేటు విషయంలోనే తేడాలు ఉంటూ వచ్చాయి. రెండు సంవత్సరాల కిందట విడుదల చేసిన శాంసంగ్ జెడ్‌ ఫోల్డబుల్ స్మార్ట్‌పోన్ ధర లక్ష రూపాయలకు పైగా పలికింది. ఇప్పుడు కొత్తగా తయారు చేసిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 మోడల్ ధర పాత హ్యాండ్‌సెట్ కంటే 22 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్3 రకం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రేటు 17 శాతం తక్కువగా ఉండొచ్చని పేర్కొంది.

English summary

Samsung: ఆ స్మార్ట్‌ఫోన్లను మడత పెట్టేయొచ్చు: లాంచ్ డేట్..రేటు ఇదే | Samsung Electronics is expected to announce of folded smartphones on August 11.

Samsung is likely to begin selling the new Galaxy Z Fold3 at around 1.99 million won. The price of the Samsung Galaxy Z Fold3 would be 17 per cent lower than the previous model which was being sold at 2.39 million won
Story first published: Saturday, July 17, 2021, 16:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X