For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాటరీలు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు: భద్రతకు ముప్పు అంటున్నమహీంద్రా ఎలక్ట్రిక్

|

ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్ బ్యాటరీలు లేకుండానే చెయ్యవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా తమకు నచ్చిన ఎలక్ట్రిక్ బ్యాటరీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బ్యాటరీ పరిశ్రమకు ఊతం ఇవ్వడంతోపాటుగా,ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపించేలా ఉంది.

వేరే తయారీదారుల నుండి బ్యాటరీని కొనడం వల్ల వారంటీ సమస్యలు

వేరే తయారీదారుల నుండి బ్యాటరీని కొనడం వల్ల వారంటీ సమస్యలు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ మహీంద్రా ఎలక్ట్రిక్ మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. వాహన తయారీదారులే వాహన భద్రతకు బాధ్యులని , బ్యాటరీ లేకుండా విక్రయాలకు అనుమతించడం వల్ల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశముందని మహీంద్రా ఎలక్ట్రిక్ పేర్కొంది. వేరే తయారీదారుల వద్దనుండి బ్యాటరీని కొనడం వల్ల వారంటీ సమస్య కూడా ఏర్పడుతుందని ,సహజంగా వాహన తయారీదారుడు వాహనానికి సంబంధించిన వారంటీ ఇస్తారని పేర్కొంది.

ప్రపంచంలో ఏ దేశం ఇలాంటి వ్యవస్థను అనుమతించదు

ప్రపంచంలో ఏ దేశం ఇలాంటి వ్యవస్థను అనుమతించదు

వాహనం తయారీ, నాణ్యత పరీక్ష, విక్రయాలు అన్నిటికీ అనుసంధానం ఉండాలని , అలా కాకుంటే గందరగోళంగా పరిస్థితి తయారవుతుందని మహీంద్రా ఎలక్ట్రిక్ ఎండి మరియు సీఈవో మహేష్ బాబు అంటున్నారు. ముందుగా అమర్చిన బ్యాటరీలు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకం మరియు రిజిస్ట్రేషన్‌ను అనుమతించాలన్న ప్రభుత్వ చర్యపై మహీంద్రా ఎలక్ట్రిక్ విరుచుకుపడింది. ప్రపంచంలో ఏ దేశమూ ఇలాంటి వ్యవస్థను అనుమతించదని, ఈ దశను ఆలోచించలేదని మహీంద్రా ఎలక్ట్రిక్ ఎండీ మరియు సిఈఓ మహేష్ బాబు అన్నారు.

ఈ నోటిఫికేషన్ గందరగోళం అన్న మహీంద్రా ఎలక్ట్రిక్

ఈ నోటిఫికేషన్ గందరగోళం అన్న మహీంద్రా ఎలక్ట్రిక్

ఫ్యాక్టరీతో అమర్చిన బ్యాటరీలు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం మరియు నమోదును ప్రభుత్వం అనుమతించటం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఊతం ఇచ్చేలా ఉన్నా వాహనాల్లో బ్యాటరీ మాత్రమే 30-40 శాతం వ్యయంతో కూడుకున్నది .అయితే వాహన తయారీ కంపెనీ కాకుండా ఇతర కంపెనీల ద్వారా బ్యాటరీలను విడిగా కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొనటంతో ఈ నోటిఫికేషన్ గందరగోళాన్ని సృష్టించిందని అన్నారు మహీంద్రా ఎలక్ట్రిక్ ఎండి మరియు సిఈవో మహేష్ బాబు.

English summary

బ్యాటరీలు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు: భద్రతకు ముప్పు అంటున్నమహీంద్రా ఎలక్ట్రిక్ | Sales of electric vehicles without batteries .. Mahindra Electric says threat to safety

Mahindra Electric lashed out at the govt's move to allow sale and registration of electric vehicles (EV) without pre-fitted batteries, saying no country in the world allows such a system and sale of the vehicle, the OEM is responsible for the safety of the vehicle.
Story first published: Friday, August 14, 2020, 20:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X