For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar safety: ఆధార్ వివరాలు ఇలా భద్రపరుచుకోండి.. ఇంటి వద్ద నుంచే.. ఖర్చులేకుండానే..

|

Aadhaar safety: మనలో చాలా మంది ఆధార్ కార్డ్ వివరాలను అనేక చోట్ల అందిస్తుంటాం. అయితే ఆధార్ కార్డు భద్రతను పటిష్టం చేసేందుకు బయోమెట్రిక్ ఉపయోగించబడుతుందని మనలో చాలా మందికి తెలియదు. ఇవి మీ వేలిముద్రలు, కంటి స్కానర్. ఆధార్‌ను ఎంత సురక్షితమైనదిగా తయారు చేసినప్పటికీ.. అది ఎక్కడో ఒకచోట దుర్వినియోగం అవుతుంది. ఇలాంటి కథలు రోజూ వార్తల్లో ఎన్నో వింటుంటాం. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ ఆధార్ కార్డుపై అదనపు భద్రతను ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం ఆధార్ కార్డును లాక్ చేయడం, అన్‌లాక్ చేయడంలో సహాయం చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఒక నిబంధనను రూపొందించింది.

ఎలా లాక్ చేసుకోవాలి..

ఎలా లాక్ చేసుకోవాలి..

ఆధార్ కార్డ్ హోల్డర్ ఎవరైనా అతని/ఆమె ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయడానికి వీలు ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా సులభమైనది. దీనిని ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో సులువుగా చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవకసరం అస్సలు ఉండదు. అదే విధంగా కావల్సినప్పుడు దానిని అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు. బయోమెట్రిక్‌లను లాక్ చేయకపోతే తరువాత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో హ్యాకర్లు ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని సులవుగా తస్కరిస్తున్నారు. వారి భారిన మన సమాచారం పడకుండా చూసుకునేందుకు ముందుగా జాగ్రత్త పడటం అత్యవసరం.

 బయోమెట్రిక్‌లను లాక్ చేయటం ఇలా:

బయోమెట్రిక్‌లను లాక్ చేయటం ఇలా:

1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ అయిన uidai.gov.inను సందర్శించండి.

2. My Aadhaarకి వెళ్లి, Aadhaar Servicesని ఎంచుకోండి.

3. ఆ తర్వాత సెక్యూర్ బయోమెట్రిక్స్‌కి వెళ్లండి.

4. ఇక్కడ మీరు ఆధార్ నంబర్‌ను నమోదు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

5. Send OTPపై క్లిక్ చేయగానే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.

6. బయోమెట్రిక్‌లను లాక్/అన్‌లాక్ చేయడానికి ఎంపికను ఎంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి.

7. తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో కింద ఇచ్చిన టిక్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి.

8. ఇప్పుడు మీ బయోమెట్రిక్స్ లాక్ చేయబడుతుంది.

 రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరి..

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరి..

ఈ సేవను వినియోగించుకోవటానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం. మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో రిజిస్టర్ కానట్లయితే, మీరు సమీపంలోని కేంద్రం/మొబైల్ అప్‌డేట్ ఎండ్ పాయింట్‌ని సందర్శించి ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని తరువాత ఆధార్ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవచ్చు.

 బయోమెట్రిక్‌లను అన్‌లాక్ చేసుకోండిలా..

బయోమెట్రిక్‌లను అన్‌లాక్ చేసుకోండిలా..

* అన్‌లాక్ కోసం కూడా UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి లాగిన్ అవ్వాలి.

* మై ఆధార్‌కి వెళ్లి ఆధార్ సేవలకు ఎంచుకోవాలి.

* ఇప్పుడు సెక్యూర్ మీ బయోమెట్రిక్స్‌కి వెళ్లండి.

* దీని తరువాత పైన పేర్కొన్న విధంగా ఆధార్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.

* ఆపై లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఎంపికను ఎంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి.

* ఇప్పుడు మీకు రెండు ఆప్షన్‌లు వస్తాయి. అందులో ఒకటి అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఉంటుంది.

* తాత్కాలికంగా, మరొకటి అన్‌లాక్ బయోమెట్రిక్స్ శాశ్వతంగా ఉంటుంది. మీరు దేనినైనా ఎంచుకోవచ్చు.

* ఎంపిక తర్వాత మీ బయోమెట్రిక్స్ అన్‌లాక్ అవుతాయి.

English summary

Aadhaar safety: ఆధార్ వివరాలు ఇలా భద్రపరుచుకోండి.. ఇంటి వద్ద నుంచే.. ఖర్చులేకుండానే.. | safeguard aadhaar biometric details by locking them virtually at free of cost from home

safeguard aadhaar biometric details by locking them know details
Story first published: Thursday, August 18, 2022, 13:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X