For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?

|

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మాజీ ఫండ్ మేనేజర్, చీఫ్ ట్రేడర్ అయిన వీరేష్ జోషి తనను ఉద్యోగం నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తు దావా వేశారు. యాక్సిస్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (యాక్సిస్ AMC), రూ. 2.43 ట్రిలియన్ల ఆస్తులతో భారతదేశంలోని ఏడవ అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ హౌస్ గా ఉంది. అయితే జోషి, అతని మాజీ సహోద్యోగి, అసిస్టెంట్ ఫండ్ మేనేజర్ దీపక్ అగర్వాల్ పై నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణాలు వచ్చాయి. దీంతో విచారణకు ఆదేశించారు. దీంతో ఫండ్ హౌస్ మే 18న జోషిని, మే 20న అగర్వాల్‌ను కూడా తొలగించింది.

దీనిపై జోషి న్యాయవాదులు మే 20న ఫండ్ హౌస్‌కి పంపిన లీగల్ నోటీసులు పంపించారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు అతన్ని ఎందుకు తొలగించారనే దానిపై వివరణాత్మక వివరణ కోరుతూ దావా వేశారు. ఫండ్ హౌస్ ఇప్పటివరకు దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. మే ప్రారంభంలో ఫండ్ హౌస్ తన ఈక్విటీ ఫండ్ మేనేజ్‌మెంట్‌లో మార్పులను అమలు చేసినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

Sacked fund manager Viresh Joshi sues MF house alleging wrongful termination

ఉద్యోగం నుంచి తనను మానసిక ఆవేదనకు గురి చేశారని జోషి యాక్సిస్ అసెట్ మేనేజ్‌మెంట్‌పై ఆరోణాలు చేశారు. ఇందుకు రూ. 54 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించి జూన్ 23న బొంబాయి హైకోర్టులో దావా వేశారు. సుమారు 20 సంవత్సరాల నుంచి క్యాపిటల్ మార్కెట్‌లో ఉన్న జోషి, 2009 నుంచి యాక్సిస్ AMCలో ఉన్నారు. యాక్సిస్ AMCలో పని చేయడానికి ముందు, అతను BNP పారిబాస్ సెక్యూరిటీస్, ICICI సెక్యూరిటీస్‌లో పనిచేశాడు.

Read more about: axis mutual fund
English summary

Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..? | Sacked fund manager Viresh Joshi sues MF house alleging wrongful termination

Viresh Joshi, a former fund manager and chief trader of Axis Mutual Fund, has filed a lawsuit accusing the asset management company of unfairly terminating his employment in connection with a suspected front-running case.
Story first published: Sunday, July 3, 2022, 18:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X