న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 నోట్ల రూపంలో 43.22 శాతం లెక్కలేని ధనాన్ని ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. అదే సమయంలో అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలలో ఇది 60 శాతంగా ఉండేదని చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.2,000 నోట్ల శాతం ఇప్పుడు గణనీయంగా తగ్గిందని చెప్పారు.

భారీగా తగ్గిన రూ.2,000 నోట్లు
2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 నోట్ల సీజ్ 67.91 శాతంగా ఉండగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 65.93 శాతంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 43 శాతంగా ఉన్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తానికి ఇవి తగ్గినట్లు చెప్పారు. ఐటీ దాడుల్లో పట్టుబడుతున్న అక్రమ ఆస్తుల్లో రూ.2,000 నోట్లతో ఎక్కువ భాగమని, కానీ గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గిందన్నారు. ఇలా తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ విధానాలు కారణంగా భావిస్తున్నారు.

2019 మార్చి నాటికి రూ.2,000 నోట్ల వ్యాల్యూ ఎంతంటే?
2019 మార్చి నాటికి 3,291 మిలియన్ల రూ.2,000 నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. వీటి వ్యాల్యూ 6,582 బిలియన్లు. ఈ ఏడాది మార్చి నాటికి వ్యాల్యూమ్‌లో ఈ కరెన్సీ (రూ.2000 నోటు) షేర్ 3 శాతం. అదే సమయంలో వ్యాల్యూలో అయితే 31.2 శాతంగా ఉంది.

మూడేళ్లలో రూ.2000 నోట్ల రాక
2016-17 మార్చి నాటికి 3,504 మిలియన్ల రూ.2,000 నోట్లు సర్క్యులేషన్‌లో ఉండగా వాటి వ్యాల్యూ రూ.7,008 బిలియన్లు.
2017-18 మార్చి నాటికి 151 మిలియన్ల రూ.2,000 నోట్లు సర్క్యులేషన్‌లో తోడయ్యాయి. వీటి వ్యాల్యూ రూ.302 బిలియన్లు.
2018-19 మార్చి నాటికి 47 మిలియన్ల రూ.2,000 నోట్లు సర్క్యులేషన్‌లో తోడయ్యాయి. వీటి వ్యాల్యూ రూ.94 బిలియన్లు.

రూ.500 నోట్ల విషయానికి వస్తే..
2016-17 మార్చి నాటికి 7,260 మిలియన్ల రూ.500 నోట్లు సర్క్యులేషన్‌లో ఉండగా వాటి వ్యాల్యూ రూ.3,630 బిలియన్లు.
2017-18 మార్చి నాటికి 9,693 మిలియన్ల రూ.500 నోట్లు సర్క్యులేషన్‌లో తోడయ్యాయి. వీటి వ్యాల్యూ రూ.4,847 బిలియన్లు.
2018-19 మార్చి నాటికి 11,468 మిలియన్ల రూ.500 నోట్లు సర్క్యులేషన్‌లో తోడయ్యాయి. వీటి వ్యాల్యూ రూ.5,734 బిలియన్లు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications