For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

16GBకి రూ.150 దారుణం: సునీల్ మిట్టల్, మొబైల్ యూజర్లకు షాక్.. 6నెలల్లో ఛార్జీల పెరుగుదల!

|

మొబైల్ యూజర్లకు మరోసారి షాక్ తగలనుంది! రానున్న ఆరు నెలల కాలంలో మొబైల్ సర్వీస్ చార్జీలు పెరగనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ సోమవారం నాడు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుత డేటా ఛార్జీలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. టెలికం పరిశ్రమ బతికి ఉడాలంటే డేటాపై ప్రస్తుతం ఉన్న ధరలు ఏమాత్రం సరిపోవని ఆయన స్పష్టం చేశారు. డేటా చార్జీలు చాలా కనిష్ట చార్జీలో ఉన్నాయని చెప్పారు.

వారు మాత్రమే చాలా లక్కీ!! ఈసారి భారీగా పడిపోయిన వేతన పెంపువారు మాత్రమే చాలా లక్కీ!! ఈసారి భారీగా పడిపోయిన వేతన పెంపు

160కే 16GB డేటా.. దారుణం

160కే 16GB డేటా.. దారుణం

'మొబైల్ కస్టమర్లకు నెలకు రూ.150 నుండి రూ.160కే 16GB డేటా లభించడం దారుణమైన విషయం' అని సునీల్ మిట్టల్ అన్నారు. దాదాపు ఏ దేశంలోను ఇలా లేదని అభిప్రాయపడ్డారు. కస్టమర్ ఇదే ధరతో నెలకు 1.6GB వినియోగంతో సరిపెట్టుకోవడం లేదంటే ఎక్కువ ఛార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని, అయితే అమెరికా, యూరప్ తరహాలో నెలకు 50 డాలర్ల నుండి 60 డాలర్ల వరకు వసూలు చేయాలనుకోవడం లేదని, కానీ, 2 డాలర్ల కంటే తక్కువ రేటుకే (దాదాపు రూ.150కి పైగా) 16GB డేటాను మాత్రం అందించడం కష్టమేనని చెప్పారు.

ఆర్పు రూ.300 ఉండాలి.. వాటికి అదనంగా చెల్లిస్తే..

ఆర్పు రూ.300 ఉండాలి.. వాటికి అదనంగా చెల్లిస్తే..

డిజిటల్ కంటెంట్ వినియోగం పెరుగుతోందని, వచ్చే 6 నెలల్లో ఒక్కో కస్టమర్ నుంచి ఆదాయం(ARPU-యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) రూ.200 దాటవచ్చునని సునీల్ మిట్టల్ అన్నారు. టెలికం సంస్థలకు 300 ARPU ఉండాలని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ వినియోగదారులకు మంచి డేటా కారణంగా నెలకు రూ.100 తక్కువే అవుతుందన్నారు. ఒకవేళ మీరు టీవీ, మూవీస్, ఎంటర్టైన్మెంట్, ఇతర ప్రత్యేక సేవలు పొందాలంటే మాత్రం దానికి అదనంగా చెల్లించాలని సూచించారు. ఆర్పు రూ.200 దాటుతుందని భావిస్తున్నామని, రూ.250 బెట్టర్ అన్నారు.

పెట్టుబడుల కోసం..

పెట్టుబడుల కోసం..

భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన ఓ పుస్తకం లాంచింగ్‌లో సునీల్ మిట్టల్ పాల్గొని, మాట్లాడారు. టెలికం సంస్థలు 5G టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు.

కాగా, ఎయిర్‌టెల్‌తో పాటు మిగతా కంపెనీలు గత ఏడాది డిసెంబర్ నెలలో ఛార్జీలు పెంచాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఆర్పు రూ.157గా ఉంది. డిసెంబర్ 2019లో టారిఫ్ పెంచిన తర్వాత ఈ ఆర్పు నమోదయింది.

English summary

16GBకి రూ.150 దారుణం: సునీల్ మిట్టల్, మొబైల్ యూజర్లకు షాక్.. 6నెలల్లో ఛార్జీల పెరుగుదల! | Rs 160 for 16 GB data not sustainable: Sunil Mittal hints at tariff hike

Bharti Airtel chairman Sunil Bharti Mittal on Monday hinted at an increase in mobile services prices in the next six months, saying that data at low rates is not sustainable for the telecom industry. He said that 16 GB data consumption a month for ₹160 is a tragedy.
Story first published: Tuesday, August 25, 2020, 7:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X