Rishad Premji: 10 నిమిషాల్లో ఉద్యోగం పీకేసిన రిషత్ ప్రేమ్‌జీ.. సీనియర్ ఉద్యోగిపై సీరియస్.. అంతేనా..?
Rishad Premji: ఈ మధ్య కాలంలో విప్రోకు చెందిన రిషద్ ప్రేమ్‌జీ తీసుకునే విర్ణయాలు చాలా సంచలనంగా మారిపోయాయి. ఆయన నిర్ణయాలు, ముక్కుసూచిగా ముందుకెళుతున్న ప్రవర్తన చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నిమిషాల్లో నిర్ణయం..
ఎవరినైనా ఉద్యోగిని తొలగించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అదే సీనియర్ల విషయంలో మరీ సమయం తీసుకుంటాం. కానీ ఐదీ దిగ్గజం విప్రో సారధిగా ఉన్న రిషద్ ప్రేమ్‌జీ కేవలం 10 నిమిషాల్లో నిర్ణయం తీసుకున్నారంట. అలా టాప్- 20 ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిని తొలగించటంపై పెను దుమారం చెలరేగింది. ఇంతరీ ఆ ఉద్యోగి ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

తొలగింపుకు కారణం..
అక్టోబర్ 19న బెంగుళూరులో జరిగిన నాస్కామ్ సమావేశంలో రిషద్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ సీనియర్ అధికారిని తొలగించినట్లు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని కేవలం 10 నిమిషాల్లో తీసుకున్నట్లు చెప్పారు. కంపెనీకి అతని పాత్ర చాలా ముఖ్యమైనదని, అయితే కష్ట సమయంలో ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు.

కంపెనీనే ముందు..
రిషద్ ప్రేమ్‌జీ కంపెనీ సమగ్రతను ఎలా విలువైనదిగా భావిస్తుందో నొక్కి చెప్పడం ఇది రెండోసారి. సెప్టెంబరులో మూన్ లైటింగ్ గురించి చర్చ తలెత్తినప్పుడు తాను దానికి వ్యతిరేకమంటూ సూటిగా వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే తనకైనా ఉద్యోగం ఉండదని రిషద్ ప్రేమ్‌జీ అన్నారు.

స్టార్టప్ కంపెనీలు..
దేశంలోని స్టార్టప్ కంపెనీలు వాల్యుయేషన్‌కు బదులుగా.. విలువైన వ్యాపారాలను నిర్మించడంపై దృష్టి పెట్టాలని రిషద్ వ్యాఖ్యానించారు. కంపెనీలను నిర్మించటం అనేది సుదీర్ఘమైనదన్నారు. సంక్లిష్టమైన ఈ ప్రయాణం కొన్నిసార్లు నెమ్మదిగా ఉంటుందని.. డబ్బు సంపాదించాలని అనుకుంటున్నట్లయితే కంపెనీ భిన్నంగా ఉంటుందన్నారు. సరైన వ్యక్తులను నియమించుకోవటం చాలా కీలకమైనదని రిషద్ అన్నారు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు చాలా విజయవంతమైన వ్యక్తులుగా ఉంటారన్నారు.

తిరిగి రావాల్సిందే..
కంపెనీ ఉద్యోగులందరినీ కొంతకాలం తిరిగి కార్యాలయాలకు తీసుకురావాలని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ బుధవారం ఆకాంక్షించారు. కరోనా తర్వాత సంస్థలో ఉద్యోగుల అనుసంధానాన్ని నిర్మించడం సవాలుగా మారిందని నాస్కామ్ సమావేశంలో అన్నారు. అందుకే తన సిబ్బందిని తిరిగి ఆఫీసులకు తీసుకురావాలని రిషద్ బలంగా కోరుకుంటున్నారు.