For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో బ్రిటన్ కంపెనీ కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీ యత్నం!

|

రిలయన్స్ జియోలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించిన ముఖేష్ అంబానీ, ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లోకి దిగ్గజ కంపెనీల పెట్టుబడులను తీసుకు వస్తున్నారు. ఓ వైపు జియో, రిలయన్స్ రిటైల్‌లో దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానిస్తూ, మరోవైపు ఇతర కంపెనీలను అక్వైర్ చేసుకుంటున్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. గత ఏడాది వరల్డ్ ఫేమస్ బ్రిటిష్ టాయ్ స్టోర్ హామ్‌లేస్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు యూకేకు చెందిన దిగ్గజం డెబెన్‌హామ్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

250 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ: ముఖేష్ అంబానీ చేతికి ఆ ప్రముఖ టాయ్స్ కంపెనీ250 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ: ముఖేష్ అంబానీ చేతికి ఆ ప్రముఖ టాయ్స్ కంపెనీ

మరో బ్రిటన్ కంపెనీని కొనుగోలు చేసేందుకు..

మరో బ్రిటన్ కంపెనీని కొనుగోలు చేసేందుకు..

బ్రిటన్‌కు చెందిన బహుళజాతి రిటైల్ కంపెనీ డెబెన్‌హామ్స్‌ను రిలయన్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో ఫ్రాంచైజీ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది డెబెన్‌హామ్స్. ఈ కంపెనీకి 242 ఏళ్ల కంపెనీ ఇది. దీనిని పాక్షికంగా లేదా పూర్తిగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కొద్ది కంపెనీల్లో రిలయన్స్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్ ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి టేకోవర్ ఒప్పందానికి అంగీకారం కుదరవచ్చునని భావిస్తున్నారు. ఈ మేరకు స్కై-న్యూస్ బుధవారం తెలిపింది.

రుణదాతల చేతిలో...

రుణదాతల చేతిలో...

ప్రస్తుతం డెబెన్‌హామ్స్ యాజమాన్యం రుణదాతల కన్సార్టియం చేతిలో ఉంది. ఏప్రిల్ నుండి కన్సార్టియం చేతిలో ఉంది. ఆర్థిక సలహాలు ఇచ్చే కంపెనీ లాజార్డ్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ కొనుగోలుదారులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. గత ఏడాది జూలై నెలలో మొత్తం నగదు రూపంలో రూ.620 కోట్లతో హామ్‌లేస్‌ను రిలయన్స్ అనుబంధ విభంగా రిలయన్స్ బ్రాండ్స్ కొనుగోలు చేసింది.

గ్లోబల్ బ్రాండ్స్‌తో జట్టు

గ్లోబల్ బ్రాండ్స్‌తో జట్టు

రిలయన్స్ బ్రాండ్స్ గ్లోబల్ బ్రాండ్లతో జాయింట్ వెంచర్‌ను నిర్వహిస్తున్నాయి. గత నెలలో ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకుంది. దీనిని రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ జియో ద్వారా ఆన్‌లైన్ వాణిజ్య వ్యూహాన్ని అనుసరిస్తోంది. అమెరికా ప్రయివేటు ఈక్విటీ(PE) కేకేఆర్ అండ్ కోకు రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటాను విక్రయించినట్లు బుధవారం తెలిపింది. అంతకుముందు సిల్వర్ లేక్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.

English summary

మరో బ్రిటన్ కంపెనీ కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీ యత్నం! | RIL in race to acquire UK's Debenhams, says report

Oil to retail conglomerate Reliance Industries Ltd (RIL) is said to be in the race to acquire Debenhams, a British multinational retailer operating department stores in the UK with franchise stores in other countries, Sky News reported on Wednesday.
Story first published: Friday, September 25, 2020, 12:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X