For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RIL AGM 2020: ముఖేష్ అంబానీ ఏం చెబుతారు?

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) 43వ ఏజీఎం సమావేశం నేడు (జూలై 15, బుధవారం) మధ్యాహ్నం ప్రారంభమవుతోంది. రిలయన్స్ తొలిసారి ఆన్‌లైన్ ద్వారా వార్షిక సాధారణ సమావేశం(AGM) నిర్వహిస్తోంది. వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతున్నారు. ఒకేసారి 500 ప్రాంతాల నుండి లక్షమందికి పైగా షేర్ హోల్డర్లు లాగిన్ అయి సమావేశంలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు.

సౌదీ ఆరామ్‌కో పెట్టుబడులు, జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్, రిలయన్స్ రిటైల్, జియో మార్ట్ రోడ్ మ్యాప్, పెట్రోకెమికల్ వ్యాపారం, ఆయిల్ టు కెమికల్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ టార్గెట్ అంశంపై ముఖేష్ మాట్లాడుతారని భావిస్తున్నారు.

RIL 43rd AGM: సరికొత్త ఆన్‌లైన్ వేదిక ద్వారా.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు...RIL 43rd AGM: సరికొత్త ఆన్‌లైన్ వేదిక ద్వారా.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు...

RIL AGM 2020: Mukesh Ambani in Reliance 43rd Annual General Meeting

గత ఏజీఎంలో ఇచ్చిన హామీ కంటే పది నెలల ముందే రిలయన్స్‌ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దారు. కంపెనీ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.1.18 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించారు. బీపీతో ఇటీవల జాయింట్ వెంచర్ ప్రకటన చేశారు.

గత 13 వారాలుగా కరోనా కారణంగా ఎన్నోకంపెనీలు ఇబ్బందుల్లో ఉంటే రిలయన్స్ మాత్రం భారీ మొత్తంలో పెట్టుబడులు సమీకరించింది. దీనికి తోడు ముఖేష్ ఏమైనా కీలక ప్రకటన చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary

RIL AGM 2020: ముఖేష్ అంబానీ ఏం చెబుతారు? | RIL AGM 2020: Mukesh Ambani in Reliance 43rd Annual General Meeting

RIL AGM 2020 Updates: Reliance Industries Chairman and Managing Director Mukesh Ambani will host the conglomerate's first virtual annual general meeting today.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X