For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Elon Musk: కొనకముందే ట్విట్టర్‌పై పెత్తనం: ఉద్యోగుల తొలగింపు, వర్క్ ఫ్రమ్ హోమ్..

|

వాషింగ్టన్: టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ఎటూ తేలట్లేదు. కొనుగోలు ప్రతిపాదనలను ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించినప్పటికీ అది ముందుకు కదలట్లేదు. మూడు నెలల్లో ట్విట్టర్ యాజమాన్య బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

 ఎన్నో కొర్రీలు..

ఎన్నో కొర్రీలు..

ట్విట్టర్ ఫేక్, స్పామ్ అకౌంట్స్ వ్యవహారంపై ఎలాన్ మస్క్ లేవనెత్తిన అనుమానాలతో తాత్కాలికంగా ఈ బిగ్ డీల్‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ చేతికి వెళ్లినట్టే వెళ్లిన ఈ బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ కొనుగోలు ప్రక్రియలో అనుకోని అవాంతరాలు వచ్చి పడ్డాయి. కొనుగోలు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

44 బిలియన్ డాలర్లతో..

44 బిలియన్ డాలర్లతో..

అపర కుబేరుడు లాన్ మస్క్- 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఆ కంపెనీ కూడా అంగీకరించింది. మస్క్ చేసిన ప్యాకేజీకి ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకారం తెలిపారు. ఈ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. మూడు నెలల్లో కంపెనీ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దశలో దీనికి బ్రేక్ పడింది.

మస్క్‌పై వ్యతిరేకత..

మస్క్‌పై వ్యతిరేకత..

యాజమాన్య బదిలీ ట్విట్టర్ ఉద్యోగులకు నచ్చట్లేదు. మెజారిటీ ఎంప్లాయిస్ దీన్ని వ్యతిరేకిస్తోన్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. ఎలాన్ మస్క్ చేతికి వెళ్లిన తరువాత కంపెనీ భవితవ్యం ఎలా ఉంటుందనే విషయంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. కొన్ని సందర్భాల్లో ట్విట్టర్‌పై ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలను గుప్పించడాన్ని తప్పుపడుతున్నారు.

మస్క్ కీలక భేటీ..

మస్క్ కీలక భేటీ..

ఈ పరిస్థితుల మధ్య ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ భేటీ సాగింది. వారితో లైవ్ ఛాట్ చేశారు మస్క్. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం తెరమీదికి వచ్చిన తరువాత మస్క్ వారితో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఉద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కొన్ని కీలకమైన సంకేతాలను పంపించారు.

ఖర్చు తగ్గింపుపై..

ఖర్చు తగ్గింపుపై..

ఫ్రీ స్పీచ్ మొదలుకుని ఖర్చు తగ్గించుకోవడం వరకు పలు అంశాలపై ట్విట్టర్ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు ఎలాన్ మస్క్ బదులిచ్చారు. సంస్థ నిబంధనలను ఉల్లంఘించనంత వరకూ ఎవ్వరైనా, ఏదైనా మాట్లాడొచ్చని, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చని స్పష్టం చేశారు. కాస్ట్ కటింగ్‌కు వెళ్లాలనే ఆలోచన ఉన్నట్లు ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు. సంస్థ కోసం కష్టపడి పని చేసే వారికి ఢోకా లేదనే భరోసా ఇచ్చారు.

 వారికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్..

వారికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్..

సంస్థ కోసం నిజాయితీగా, అద్భుతంగా పని చేసే వారికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తానని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్నే కోరుకుంటున్నామని చాలామంది ఉద్యోగులు ఆయనకు వివరించారు. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌పై వాణిజ్య ప్రకటనలకు తాను వ్యతిరేకిని కాదని, అవి అత్యంత కీలకమనీ అన్నారు. యూజర్లకు ఎంటర్‌టైన్ చేయడానికి అవసరమైన యాడ్స్ కోసం తాను ఇదివరకే కొందరు అడ్వర్టయిజర్లతో మాట్లాడాననీ చెప్పారు.

English summary

Elon Musk: కొనకముందే ట్విట్టర్‌పై పెత్తనం: ఉద్యోగుల తొలగింపు, వర్క్ ఫ్రమ్ హోమ్.. | Right now costs exceed revenue, Elon Musk told employees

Speaking to Twitter staff during an internal meeting, Elon Musk said that the company “needs to get healthy” financially and also bring the cost down.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X