For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు: రిటైల ద్రవ్యోల్భణం 4.59 శాతానికి..

|

దేశీయ రిటైల్ ద్రవ్యోల్భణాన్ని సూచించే భారత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డిసెంబర్ నెలలో 4.59 శాతానికి తగ్గింది. నవంబర్ నెలలో ఇది 6.93 శాతంగా ఉంది. ఈ నెల సీపీఐ రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అప్పర్ మార్జిన్ 6 శాతానికి పడిపోయింది. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ (CFPI) లేదా ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్భణం డిసెంబర్ నెలలో 3.41 శాతానికి తగ్గింది. ప్రభుత్వ డేటా ప్రకారం నవంబర్ నెలలో ఇది 9.50 శాతంగా నమోదయింది. ప్రధానంగా ఆహార ధరల తగ్గుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్భణంలో క్షీణత ఏర్పడింది.

ఇది 15 నెలల కనిష్టస్థాయి

ఇది 15 నెలల కనిష్టస్థాయి

సరళతర ద్రవ్య పరపతి విధానం దిశలో ఆర్బీఐ కీలకచర్య తీసుకునేందుకు వీలుకల్పించే ఆర్థిక గణాంకాలు మంగళవారం వెల్లడయ్యాయి. దీని ప్రకారం సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 డిసెంబర్ మాసంలో 4.59 శాతానికి తగ్గడం గమనార్హం. 2019 డిసెంబర్‌తో పోలిస్తే రిటైల్‌ ద్రవ్యోల్బణానికి సంబంధించి పరిగణనలోకి తీసుకునే ఉత్పత్తుల బాస్కెట్ ధర ఈ మేరకు పెరిగినట్లు. ఇది 15 నెలల కనిష్టస్థాయి. కూరగాయల ధరలు 10 శాతానికి పైగా తగ్గడం ధరల సూచీ 15 నెలల కనిష్ఠానికి చేరుకోవడానికి ప్రధాన కారణమని కేంద్ర గణాంకాల శాఖ తెలిపింది. కూరగాయల ధరలు 10.41 శాతం తగ్గాయి.

గాడిన పడినట్లే

గాడిన పడినట్లే

ఇక అంతకుముందు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) 2020 నవంబర్ నెలలో 1.9 శాతం క్షీణించింది. అంతక్రితం రెండు నెలలు వృద్ధి ాటలో నడిచిన సూచీ మళ్లీ క్షీణించింది. రిటైల్ ద్రవ్యోల్భణాన్ని ఆర్బీఐ 2 శాతం నుండి 6 శాతం మధ్య నిర్దేశించుకుంది. అంటే ఈసారి దాదాపు గాడిన పడినట్లుగా భావించవచ్చు. వచ్చే నెల 3వ తేదీ నుండి 5వ తేదీ మధ్య ద్రవ్య పరపతి విధాన ద్వైమాసిక సమావేశం ఉంది.

ఏ రంగం ఎలా..

ఏ రంగం ఎలా..

ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన తయారీ రంగం 1.7 శాతం క్షీణించింది. మైనింగ్ 7.3 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 7.1 శాతం, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి కన్స్యూమర్ డ్యూరబుల్ 0.7 శాతం, దుస్తులు, సబ్బులు, టూత్ పేస్టులు వంటి నాన్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.7 శాతం క్షీణించాయి. విద్యుత్ మాత్రం 3.5 శాతం వృద్ధి సాధించింది.

English summary

తగ్గిన కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు: రిటైల ద్రవ్యోల్భణం 4.59 శాతానికి.. | Retail inflation in India eases to 4.59 percent in December

India's Consumer Price Index (CPI), which measures the country's retail inflation eased to 4.59 percent in December versus 6.93 percent in November. This month's CPI has fallen within the Reserve Bank of India’s (RBI) upper margin of 6.
Story first published: Wednesday, January 13, 2021, 14:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X