For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

16 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం, దిగొచ్చిన కూరగాయల ధరలు

|

కూరగాయల ధరలు దిగి వచ్చాయి. జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం సూచీ 4.06 శాతానికి దిగి వచ్చింది. గత ఏడాది అన్నింటి ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. అయితే జనవరిలో ప్రధానంగా కూరగాయల ధరలు తగ్గడం దోహదపడింది. గత ఏడాది చివరి నెలలో (డిసెంబర్) రిటైల్ ద్రవ్యోల్భణం 4.59 శాతంగా ఉండగా, ఇప్పుడు 4.06 శాతానికి తగ్గింది. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల ఏడాది ప్రాతిపదికన 1.89 శాతంగా ఉంది. డిసెంబర్ నెలలో 3.81 శాతంగా నమోదయింది.

జనవరి నెలలో కూరగాయల ధరలు వార్షిక ప్రాతిపదికన 15.84 శాతం తగ్గడం ఇందుకు దోహదపడింది. చక్కెర, దాని సంబంధిత ఉత్పత్తుల ధరలు కూడా స్వల్పంగా 0.26 శాతం తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం నుండి 6 శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం దేశంలో ధరల భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఆర్బీఐ వరుసగా 4సార్లు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.

 Retail inflation eases to 4.06 percent in January

జనవరి రిటైల్ ద్రవ్యోల్భణం 16 నెలల కనిష్టానికి చేరుకుంది. అయితే వృద్ధి ఇప్పటికీ స్లోగానే ఉందని, నాన్-ఫుడ్ ఉత్పత్తులు ద్రవ్యోల్భణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దేశీయ పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి మళ్లీ కాస్త పుంజుకుంది. మాన్యుఫాక్చరింగ్ రంగం మెరుగైన పనితీరు కనబర్చడం ఇందుకు దోహదపడింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి వార్షిక ప్రాతిపదికన మైనస్ 18.7 శాతానికి క్షీణించింది. ఆగస్ట్ వరకు రుణాత్మక స్థాయికే పరిమితమైన సూచీ, సెప్టెంబర్ నెలలో ఒక శాతం, అక్టోబర్‌లో 4.2శాతం వృద్ధి నమోదు చేసింది.

English summary

16 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం, దిగొచ్చిన కూరగాయల ధరలు | Retail inflation eases to 4.06 percent in January

The growth inflation dynamics seem to be improving for the economy, with industrial output posting mild expansion in December and the retail price inflation rate declining to a 16-month low in January. However, economists believe that growth is still weak and non-food articles like fuel continue to face inflationary pressures, which may force the Reserve Bank of India (RBI) to remain “accommodative”.
Story first published: Saturday, February 13, 2021, 10:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X