For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మార్ట్ మీటర్.. మరో కొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ

|

మొబైల్ నుండి చమురు రంగం వరకు విభిన్న వ్యాపారాల్లో దూసుకెళ్తున్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరో కొత్త బిజినెస్ వైపు దృష్టి సారిస్తోంది. స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నారు ముఖేష్ అంబానీ. అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంపై కసరత్తు చేస్తోంది. నారో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(NB-IOT) ద్వారా సేవలు అందించాలని భావిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే ఆఫర్, ఇవి దుమ్మురేపాయ్.. అంతలోనే!ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే ఆఫర్, ఇవి దుమ్మురేపాయ్.. అంతలోనే!

జియో సాయంతో...

జియో సాయంతో...

భారత దేశ స్మార్ట్ మీటర్ ప్రోగ్రాంలో భాగంగా 25 కోట్ల సంప్రదాయ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను అమర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రభుత్వ ప్రణాళికను అందిపుచ్చుకోవాలని రిలయన్స్ భావిస్తోంది. స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ మార్కెట్ పైన రిలయన్స్ తమ అనుబంధ సంస్థ జియో సాయంతో మీటర్ డేటా సేకరణ, కమ్యూనికేషన్ కార్డులు, టెలికం, క్లౌడ్ హోస్టింగ్ సేవల్ని విద్యుత్ పంపిణీ కంపెనీలకు/డిస్కంలకు అందించాలని భావిస్తోంది. రిలయన్స్ దీనిపై స్పందించాల్సి ఉంది.

స్మార్ట్ మీటర్..

స్మార్ట్ మీటర్..

రిలయన్స్ అందించే సేవల్లో మీటర్ డేటా కలెక్షన్, కమ్యూనికేషన్ కార్డ్స్, టెలికం, క్లౌడ్ హోస్టింగ్ వంటి సేవలు ఉన్నాయని చెబుతున్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా మీటరింగ్, బిల్లింగ్, కలెక్షన్ వ్యవస్థలో మానవ జోక్యాన్ని తగ్గిస్తాయి. లాస్ పాకెట్స్ గుర్తించడం ద్వారా నష్ట నివారణ చర్యలను తగ్గిస్తాయి.

వినియోగదారుల విద్యుత్ వినియోగాన్ని ప్రతిరోజు వేర్వేరు సమయాల్లో రికార్డ్ చేస్తాయి. ఓవర్ ది ఎయిర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఈ సమాచారాన్ని ఇంధన సరఫరాదారుకు పంపిస్తాయి. విద్యుత్ వినియోగంపై మరింత సమాచారం తెలుస్తుంది.

రిలయన్స్ స్టాక్

రిలయన్స్ స్టాక్

కాగా, జియో వినియోగదారులు రోజురోజుకు పెరుగుతుండటం, ముఖేష్ అంబానీ వివిధ రంగాల్లోకి అడుగు పెడుతుండటంతో రిలయన్స్ స్టాక్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నిన్న రూ.2,280 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు ఓ సమయంలో రూ.2300 సమీపానికి వెళ్లి, మధ్యాహ్నం సమయానికి స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. 0.34 శాతం మేర నష్టపోయి రూ.2,273 వద్ద ట్రేడ్ అయింది.

English summary

స్మార్ట్ మీటర్.. మరో కొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ | Reliance now eyes smart electricity meter business

Reliance Industries Ltd (RIL) is eyeing the smart electricity meter market and plans to leverage its Jio business to offer meter data collection, communication cards, telecom and cloud hosting services to electricity distribution companies (discoms), said two people aware of the development.
Story first published: Wednesday, October 14, 2020, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X