For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

22 అంతర్జాతీయ విమానాలలో జియో సేవలు, డేటా ఛార్జీ ఎంతంటే?

|

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే వారికి జియో ఆఫర్ ప్రకటించింది. 22 ఇంటర్నేషనల్ రూట్లలో ప్రయాణించే విమానాలలో రోజుకు రూ.499తో మొబైల్ సేవలను అందించనుంది. రిలయన్స్ భాగస్వామ్య సంస్థలైన కాథే పసిఫిక్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, ఎతిహాద్, యూరో వింగ్స్, లుప్తాన్సా, మలిండో ఎయిర్, బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్, అలిటాలియా ఎయిర్ లైన్స్‌లో జియో మొబైల్ ఆఫర్ వర్తిస్తుంది.

భారత్ నుండి ప్రయాణించే విదేశీ ప్రయాణీకుల కోసం మూడు రోమింగ్ ప్యాక్స్‌ను ప్రకటించింది. దీంతో విమానంలో సేవలు అందించే రెండో భారతీయ సంస్థగా జియో నిలిచింది. టాటా గ్రూప్ సంస్థ నెల్కో లండన్ మార్గంలో విస్తారా విమానయాన సంస్థల్లో మొబైల్ సేవలు అందిస్తోంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ భేష్, చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్!: బిల్‌గేట్స్వర్క్ ఫ్రమ్ హోమ్ భేష్, చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్!: బిల్‌గేట్స్

Reliance Jio starts offering mobile services on 22 international airlines

ఇక, జియో అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం మూడు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్‌ను ఒకరోజు పాటు చెల్లుబాటు అయ్యేలా అందిస్తోంది. రూ.499, రూ.699, రూ.999 ప్యాక్ అందిస్తోంది. అన్ని ప్లాన్‌లలోను 100 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌ల సౌకర్యం ఉంది. ఇక రూ.499 ప్లాన్‌లో రూ.250 మెగాబైట్స్(MB) మొబైల్ డేటా, రూ.699 ప్లాన్‌లో 500MB డేటా, రూ.999 ప్లాన్‌లో 1GB డేటా అందిస్తోంది.

English summary

22 అంతర్జాతీయ విమానాలలో జియో సేవలు, డేటా ఛార్జీ ఎంతంటే? | Reliance Jio starts offering mobile services on 22 international airlines

Reliance Jio has started offering mobile services on 22 flights on international routes, with plans starting at ₹499 per day. The company's partner airlines include Cathay Pacific, Singapore Airlines, Emirates, Etihad Airways, Euro Wings, Lufthansa, Malindo Air, Biman Bangladesh Airlines, and Alitalia.
Story first published: Thursday, September 24, 2020, 18:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X