న్యూఢిల్లీ: వినియోగదారుల నెత్తిన టారిఫ్ భారం పడుతోంది. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తాము టారిఫ్ పెంచనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించాయి. మరుసటి రోజే రిలయన్స్ జియో కూడా రానున్న కొద్ది వారాల్లో టారిఫ్ పెంచుతామని కస్టమర్లకు షాకిచ్చింది. జియో రాక తర్వాత ఇటీవలి వరకు చవక ధరలపై యుద్ధం సాగింది. ఇప్పుడు వినియోగదారులకు షాకిస్తూ వరుసగా కంపెనీలు టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నాయి.

టారిఫ్ పెంచుతాం కానీ..
మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ఛార్జీలు పెంచుతున్నట్లు జియో తెలిపింది. ఎప్పటి నుంచి, ఎంత స్థాయిలో పెంచుతారనేది తెలియాల్సి ఉంది. అయితే తాము పెంచే టారిఫ్ ధరలు ఛార్జీల సవరణ, ఖాతాదారుల డేటా వినియోగాన్ని దెబ్బతీయని స్థాయిలో మాత్రమే ఉంటుందని జియో తెలిపింది. అలాగే, డిజిటల్ సేవల వృద్ధిని దెబ్బతీయకుండా, పెట్టుబడులపై సముచిత రాబడులు ఉండే స్థాయిలో ఛార్జీల పెంపు ఉంటుందని పేర్కొంది. దేశీయ టెలికం రంగాన్ని బలోపేతం చేసి కస్టమర్లకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారిఫ్ పెంచుతున్నట్లు జియో తెలిపింది. దీంతో డేటా వినియోగం, డిజిటల్ అనుసరణలపై ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపింది.

అందుకే ధరలు పెంచాం...
నిబంధనలకు అనుగుణంగా తాము ధరలను పెంచవలసిన పరిస్థితి అని జియో తెలిపింది. కాగా, ఇటీవల జియో తమ కస్టమర్లపై IUC ఛార్జీలను ప్రారంభించిన విషయం తెలిసిందే. జియో నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్స్‌కు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్ ఉంటుంది. ఇందుకు రెగ్యులర్ ప్యాకేజీలకు అదనంగా ఈ రూ.10 నుంచి వెయ్యి రూపాయల వరకు టాపప్స్ కూడా తీసుకు వచ్చింది.

రాజీపడేది లేదు..
మరోవైపు, టారిఫ్ సవరణల కోసం సంప్రదింపుల ప్రక్రియ చేపట్టే వీలుందని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ, నాణ్యమైన సేవల్ని అందించడంలో రాజీపడే ప్రసక్తి లేదని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి జియో కస్టమర్ల సంఖ్య 35.52 కోట్లుగా ఉంది.

యూజర్లు ఎంతమంది అంటే..
సెప్టెంబర్ నెలలో కొత్తగా 69.83 లక్షల యూజర్లు జత కావడంతో జియో కస్టమర్ల సంఖ్య 35.55 కోట్లకు చేరుకుంది. ఎయిర్‌టెల్ 23.8 లక్షల యూజర్లను కోల్పోగా, సబ్‌స్క్రైబర్స్ సంఖ్య 32.55 కోట్లుగా ఉంది. వోడాఫోన్ ఐడియా 25.7 లక్షల చందాదారులను కోల్పోయి, 37.24 యూజర్ బేస్‌ను కలిగి ఉంది.

ట్రాయ్ ఏమన్నదంటే?
ఇదిలా ఉండగా, కాల్, డేటా చార్జీల పెంపుపై టెలికాం కంపెనీల నుంచి తమకు సమాచారం లేదని ట్రాయ్ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి చార్జీలు పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, జియో వరుసగా ప్రకటించాయి. అయితే పెంపు ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని కంపెనీలు వెల్లడించలేదు. కంపెనీలు పెంపు విషయం వెల్లడించిన అనంతరం అది ట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలిస్తామని ట్రాయ్ అధికారులు అంటున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications