For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ 'జియో' అదరగొట్టింది: జియో ఆదాయం సూపర్, పెట్రో వ్యాపారం ఓకే

|

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అదరగొట్టింది. అంచనాలకు మించి ఆర్జించింది. టెలికం విభాగం జియో, రిటైల్ మద్దతుతో 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నెట్ ప్రాఫిట్ 12 శాతం పెరిగి రూ.13,101 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో నెట్ ప్రాఫిట్ రూ.3,489 కోట్లుగా నమోదయింది. ఆర్పు రూ.151కి పెరిగింది. ఇక రిఫైనింగ్ విభాగం ఆదాయం క్షీణించింది. ఈ ఆదాయం 19 శాతం క్షీణించి రూ.1,37,829 కోట్లకు తగ్గింది.

IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనంIMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం

51 శాతానికి రిటైల్, టెలికం ఆదాయం

51 శాతానికి రిటైల్, టెలికం ఆదాయం

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ.13,101 కోట్లు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,640 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో నికర లాభం సుమారు రూ. 11,420 కోట్లు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేయగా, గణనీయంగా పెరిగింది. ఆదాయంలో గణనీయ వాటా ఉండే రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారం తగ్గింది. కానీ టెలికం, రిటైల్ విభాగాలు భారీగా రాణించడం కలిసి వచ్చింది. ఏడాది క్రితం దాకా కంపెనీ ఆదాయంలో 37 శాతంగా ఉన్న ఈ రెండు విభాగాల వాటా ప్రస్తుతం 51 శాతానికి పెరిగింది.

రిటైల్ ఆదాయం

రిటైల్ ఆదాయం

పన్నుకు ముందస్తు లాభంలో దాదాపు 56 శాతం వాటా జియో, రిటైల్‌దే. సమీక్షా కాలంలో రిలయన్స్ ఆదాయం సుమారు 19 శాతం క్షీణించి రూ.1,37,829 కోట్లకు పరిమితమైంది. చమురు, రసాయనాల వ్యాపారం త్రైమాసికం పరంగా పెరిగినప్పటికీ, వార్షిక ప్రాతిపదికన తగ్గింది.

మూడో త్రైమాసికంలో రిటైల్ ఆదాయం రూ.11.80 శాతం పెరిగి రూ.3102 కోట్లుగా ఉంది. రిటైల్ స్టోర్లలో కొత్తగా 50000 నియామకాలు చేపట్టింది. కొత్తగా 327 స్టోర్స్ తెరవడంతో మొత్తం సంఖ్య 12,201కి పెరిగింది.

జియో ఆదాయం

జియో ఆదాయం

డిసెంబర్ త్రైమాసికంలో 2.5 కోట్లకు పైగా కొత్త కనెక్షన్లు జత కావడంతో జియో సబ్‌స్క్రైబర్లు 41.08 కోట్లకు చేరుకున్నారు. ఈ విభాగంలో నికర లాభం 15.5 శాతం పెరిగి రూ.3,489 కోట్లగా నమోదయింది. డిజిటల్, టెలికాం సేవలందించే జియో ప్లాట్‌ఫామ్స్ రూ.3020 కోట్ల లాభాలు ఆర్జించింది. జియో ఆదాయం రూ.22,858 కోట్లు. ఆర్పు రూ.145 నుండి రూ.151కి పెరిగింది.

English summary

రిలయన్స్ 'జియో' అదరగొట్టింది: జియో ఆదాయం సూపర్, పెట్రో వ్యాపారం ఓకే | Reliance Jio Q3 results: Profit grows to Rs 3,489 crore

Reliance Jio Infocomm reported a net profit of Rs 3,291 crore in the quarter ended December 31, marking an increase of 16 per cent compared with the previous quarter.
Story first published: Saturday, January 23, 2021, 9:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X