For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?: జియో, బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్

|

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా ప్రయివేటు రంగంలోని అన్ని సంస్థల ఉద్యోగులు దాదాపు 90 శాతం ఇంటి నుండి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.

ఐటీ కంపెనీలకు షాక్, ఉద్యోగుల వేతనాలు, బోనస్‌పై కరోనా దెబ్బఐటీ కంపెనీలకు షాక్, ఉద్యోగుల వేతనాలు, బోనస్‌పై కరోనా దెబ్బ

జియో ఆఫర్

జియో ఆఫర్

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందు కఠిన సూచనలు జారీ అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రూ.11 నుండి రూ.101 విలువైన 4G డేటా ఓచర్లతో రెట్టింపు డేటా, ఇతర నెట్ వర్క్‌లకు అదనపు టాక్ టైమ్ సదుపాయం కల్పిస్తున్నట్లు జియో తెలిపింది. ఎక్కువ వేగం డేటా పరిమితి ముగిశాక 64kbps వేగంతో అపరిమితంగా వాడుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కాస్త వెసులుబాటు.

రూ.11కు 800Mb అధిక వేగం డేటా, 75 నిమిషాల టాక్ టైమ్,

రూ.21తో 2GB డేటా 200 నిమిషాల టాక్ టైమ్,

రూ.51తో 6GB డేటా, రూ.500 నిమిషాల టాక్ టైమ్,

రూ.101తో 12GB డేటా, రూ.1,000 టాక్ టైమ్ లభిస్తుంది.

ఎందుకంటే...

ఎందుకంటే...

ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ప్రోత్సహించడంతో పాటు కుటుంబాలు, స్నేహితుల మధ్య రిమోట్ ఇంటరాక్షన్ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్ జియో తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఎక్కువ డేటా, ఎక్కువ కాల్ పరిమితి అవసరమని పేర్కొంది.

నెల రోజుల పాటు బ్రాడ్ బాండ్ ఉచితం.. బీఎస్ఎన్ఎల్

నెల రోజుల పాటు బ్రాడ్ బాండ్ ఉచితం.. బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి నెల రోజుల పాటు బ్రాడ్ బాండ్ ఉచితంగా అందిస్తామని శుక్రవారం తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉన్న వారికి రోజుకు 5GB క్యాప్‌తో 10Mbps డౌన్‌లోడ్ స్పీడ్ ఇస్తున్నట్లు తెలిపింది. తద్వారా ఈ సేవలు ఇంటి నుండి పని చేసేవారికి, ఇంటి నుండి ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే వారికి ఉపయోగకరమని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి నెల రోజుల పాటు ఉచితంగా బ్రాండ్ బాండ్ సేవలు అందిస్తామని తెలిపింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ సులువు

వర్క్ ఫ్రమ్ హోమ్ సులువు

ప్రస్తుతం ఉన్న ల్యాండ్ లైన్ కస్టమర్లు, కొత్త కస్టమర్లు కాపర్ కేబుల్ కనెక్షన్ తీసుకుంటే కనీస ఇన్స్టాలేషన్ ఛార్జీలు వసూలు చేయమని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. మోడెమ్ మాత్రం కొనుగోలు చేయాలని సూచించింది. ప్రస్తుతం ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారు, కొత్తగా కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి నెల రోజుల పాటు ఉచితంగా సేవలు అందిస్తామని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపింది. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ సులువు అని పేర్కొంది.

English summary

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?: జియో, బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్ | Reliance Jio, BSNL roll out data offers for people working from home

With a large number of employees working from home, internet service providers are now stepping up to offer plans to cater to the increased surge in data requirement. Both Jio and state-run BSNL have plans for those working from home.
Story first published: Saturday, March 21, 2020, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X