For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'A' రేటింగ్ బాండ్స్‌లోను పెట్టుబడులు, పీఎఫ్ సంస్థలకు ఓకే

|

గుర్తింపుపొందిన ప్రావిడెంట్ ఫండ్ సంస్థలు ఇక నుండి 'A' లేదా అంతకుమించి రేటింగ్ ఉన్న రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రుణ పత్రాల రేటింగ్స్ తగ్గినప్పటికీ అందులో పెట్టుబడులు కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 'A' లేదా అంతకుమించిన బాండ్స్‌లో పీఎఫ్ ట్రస్టులు పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనలు సవరిస్తూ అక్టోబర్ 22వ తేదీన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT)నోటిఫికేషన్ విడుదల చేసింది.

ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!

గుర్తింపు పొందిన ఎంప్లాయీ ప్రావిడెంట్ ట్రస్ట్స్ ప్రభుత్వ సెక్యూరిటీలల్లో 45 శాతం నుండి 55 శాతం మేర, 35 శాతం నుండి 45 శాతం వరకు డెట్ స్కీంలలో (బాండ్స్ అండ్ డిపాజిట్లు), 0 నుండి 5 శాతం వరకు షార్ట్ టర్మ్ డెబిట్ (మనీ మార్కెట్, లిక్విడ్ ఫండ్స్)లో, 5 శాతం నుండి 15 శాతం ఈక్విటీ, 0 నుండి 5 శాతం మధ్య అసెట్ బ్యాక్ట్ సెక్యూరిటీస్ (REITS, InVITs యూనిట్లు), ఇన్వెస్ట్ చేయవచ్చు.

Recognised PFs can invest in A or higher rated securities

కొత్త నిబంధనల ప్రకారం గతంలో ఏఏ రేటింగ్ బాండ్స్‌కు బదులు ఇక నుండి ఏ రేటింగ్ రుణ పత్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పలు రుణ పత్రాల రేటింగ్స్ తగ్గాయి. పీఎఫ్ పెట్టుబడి నిబంధనలు మార్చడం ద్వారా ఇలాంటి వారికి పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉంటాయి.

English summary

'A' రేటింగ్ బాండ్స్‌లోను పెట్టుబడులు, పీఎఫ్ సంస్థలకు ఓకే | Recognised PFs can invest in A or higher rated securities

The Income Tax department has allowed recognised provident funds to invest in 'A' or higher-rated debt securities, a move which will give them flexibility to retain their current investments in bonds even where such papers have been downgraded.Earlier, recognised employees provident fund trusts were required to invest in securities having 'AA' and above rating.
Story first published: Tuesday, October 27, 2020, 8:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X