For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెంటిమెంట్ ఆల్ టైమ్ లో: కుప్పకూలిన రియల్ ఎస్టేట్, కోలుకోవాలంటే..

|

కరోనా మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌పై భారీ ప్రభావం పడింది. ఉద్యోగాలు పోవడమో లేక వేతనాలు తగ్గడమో లేక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక చేతిలోని డబ్బులు ఖర్చు పెట్టవద్దని నిర్ణయించుకోవడమో.. ఏదైనా అత్యవసరం కాని వ్యాపారాలు క్షీణించాయి. అలాగే, కొత్తగా ఇళ్లు, ఫ్లాట్ వంటివి కొనుగోలు చేయడానికి కూడా చాలామంది అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో రియాల్టీ సెంటిమెంట్ 22 పాయింట్లకు పడిపోయింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 31గా ఉంది. ఎన్నడూలేని కనిష్టస్థాయి అని ప్రాపర్టెన్సీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా సర్వే వెల్లడించింది. బిల్డర్స్, పీఈ సంస్థలు, బ్యాంక్లు, ఎన్‌బీఎఫ్‌సీలను సంప్రదించి ఈ సర్వే చేసింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్ కోసం జూలే మొదటి రెండు వారాల్లో నిర్వహించారు.

రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్‌ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్!

స్పష్టత లేకపోవడంతో ఆందోళన

స్పష్టత లేకపోవడంతో ఆందోళన

అంతకుముందు క్వార్టర్ కంటే జూన్‌తో ముగిసిన క్వార్టర్ నాటికి రియాల్టీ సెంటిమెంట్ 9 పాయింట్లు పడిపోయినప్పటికీ ఫ్యూచర్ సెంటిమెంట్ ఇండెక్స్ 36 నుండి 41కు పెరిగింది. అయినప్పటికీ నిరాశావాద జోన్‌లోనే ఉంది. భవిష్యత్ పైన బిల్డర్లకు విశ్వాసం కుదరడం లేదు. స్థూల ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు క్షీణించడం, ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందనే దానిపై స్పష్టత లేకపోవడం రియాల్టీ రంగాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితి మరో ఆరు నెలలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, రికవరీ అస్పష్టత నేపథ్యంలో ఇండియా రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ కనిష్టానికి (22)పడిపోయిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో పేర్కొంది.

అందుకే.. త్వరలో పుంజుకోవచ్చు

అందుకే.. త్వరలో పుంజుకోవచ్చు

సాధారణంగా 50 స్కోర్ తటస్థస్థితిని లేదా యథాస్థితిని సూచిస్తుంది. 50 కంటే ఎక్కువ పాజిటివ్‌నెస్‌ను చూపిస్తుంది. 50 కంటే తక్కువ నెగిటివ్ సెంటిమెంట్‌కు నిదర్శనం. అయితే వచ్చేది పండుగల సీజన్ కావడంతో ఈ రెండో అర్ధ సంవత్సరంలో లేదా అక్టోబర్ నుండి కాస్త మెరుగుపడవచ్చునని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులు, ఇప్పటి వరకు వెనక్కి తగ్గిన కొనుగోలుదారుల కొనుగోళ్లు, కొన్ని రంగాలు క్రమంగా కోలుకోవడం వంటివి ఇందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే

రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దీపనలు ప్రకటించాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ అన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, వినియోగాన్ని పెంపొందించేందుకు మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగం విషయానికి వస్తే ఇళ్లు కొనుగోలుకు లేదా అద్దెలపై అదనపు పన్ను ప్రయోజనాలు, సరసమైన గృహ ప్రోత్సాహకాలు, రుణలభ్యతను సులభతరం చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో అయినా పన్నులు, లెవీ, స్టాంప్ డ్యూటీలు, జీఎస్టీ తగ్గింపు అవసరమని, ఇది డిమాండ్‌కు దోహదపడుతుందని చెబుతున్నారు.

వన్ టైమ్ రుణ పునర్నిర్మాణం సహా..

వన్ టైమ్ రుణ పునర్నిర్మాణం సహా..

వచ్చే క్వార్టర్ నుండి పుంజుకోవచ్చునని టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీఈవో, ఎండీ మరియు ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటీ చైర్మ్ సంజయ్ దత్ అన్నారు. ఆఫీస్ మార్కెట్ విషయానికి వస్తే 98-99 శాతం రెంటల్ కలెక్షన్స్ ఉన్నాయి. రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (REITS) దిశగా వస్తున్నారన్నారు

ఆర్థిక ఉద్దీపనలతో పాటు పరిశ్రమలు తిరిగి పునరుద్ధరించడానికి, వ్యాపార మూలధన అవసరాన్ని సులభతరం చేసేందుకు వన్ టైమ్ రుణ పునర్నిర్మాణం, అడిషనల్ స్ట్రెస్ ఫండ్ వంటి వాటిపై పరిశ్రమ ఆశలు పెట్టుకుందని నారెడ్కో నేషనల్ ప్రెసిడెంట్, హీరానందాని గ్రూప్ ఫౌండర్ అండ్ ఎండీ నిరంజన్ హీరానందానీ అన్నారు.

English summary

Real estate sentiment hit an all time low in April-Jun quarter

The sentiments in the country's real estate sector hit an all-time low during April-June due to the COVID-19 pandemic and remain pessimistic for the next six months even as stakeholders see slight improvement, according to a survey.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X