For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI

|

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో V షేప్ రికవరీ కనిపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా పేర్కొంది. దేశీయ కార్యకలాపాలు క్రమంగా కరోనా ముందుస్థాయికి వస్తున్నాయని, ఫీనిక్స్ తరహా రికవరీ భారత ఎకానమీలో కనిపిస్తోందని తెలిపింది. ఇటీవల కేంద్ర బ్యాంకు రిపోర్ట్ వచ్చింది. దీని ప్రకారం కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. 2021లో V షేప్ రికవరీ ఉంటుందని తెలిపింది. ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినైజేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఏడాది చివరి నాటికి 300 మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సీన్ అందించనుంది.

<strong>ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి</strong>ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి

ఆర్థిక రికవరీ కోసం మరిన్ని చర్యలు

ఆర్థిక రికవరీ కోసం మరిన్ని చర్యలు

కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినైజేషన్ ప్రారంభం కావడం నేపథ్యంలో మరోసారి కరోనా విజృంభించే అంశంపై ఆర్బీఐ స్పందించింది. భారత్‌కు మరోసారి భారీ ప్రమాదం లేదని అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు భారత ఆర్థిక రికవరీ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌కు ఆర్థిక, మానవ విపత్తు ఏర్పడిందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో ఇప్పటికే నాలుగింట ఒక వంతు కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయని వెల్లడింది.

వ్యాక్సీన్ ఎఫెక్ట్

వ్యాక్సీన్ ఎఫెక్ట్

భారత జీడీపీ 2020-21 మొదటి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే. రెండో త్రైమాసికంలో ఇది 7.5 శాతంగా ఉంది. కరోనా వంటి పెను సంక్షోభం సమయంలో భారత్ చర్యలు ప్రపంచం మెచ్చుకునేలా ఉన్నాయి. వ్యాక్సీన్ నేపథ్యంలో భారత్ వీ షేప్ రికవరీ ఉంటుందని ఆర్బీఐ నివేదిక తెలిపింది.

ఖర్చులు పెరిగాయి

ఖర్చులు పెరిగాయి

ప్రభుత్వం ఖర్చులు ఏడాది ప్రాతిపదికన నవంబర్ నెలలో 48.3 శాతం పెరిగాయి. భారత ఎగుమతులు, దిగుమతులు కూడా క్రమంగా ప్రీకోవిడ్ స్థాయికి వస్తున్నాయి. వరుసగా 9 నెలల పాటు ప్రభావం పడింది. ఏప్రిల్లో ఎగుమతులు జీరో కాగా, మే నెలలో అతి స్వల్పంగా 2 రంగాలు వృద్ది సాధించాయి. ఆ తర్వాత వరుసగా డిసెంబర్ నాటికి 20 రంగాలు వృద్ధిని సాధించాయి.

English summary

భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI | RBI sees V shaped recovery, likely room for policy easing

The shape of the recovery will be V-shaped after all, where the V stands for vaccine”, the paper said. It added that since September, India had “bent it like Beckham, while referring to the Covid infection curve.
Story first published: Saturday, January 23, 2021, 7:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X