For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI's decision on currency notes: కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

|

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్ల పైన కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా చిరిగిన, రంగులు అంటిన నోట్లు ఎవరూ తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఆర్బీఐ భారీ ఊరటను కల్పించింది. చిరిగిన లేదా రంగులు అంటిన కరెన్సీ నోట్లు మీ వద్ద ఉంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ వద్ద అలాంటి నోట్లు ఉంటే కనుక ఏదైనా బ్యాంకుకు లేదా ఆర్బీఐ శాఖల ద్వారా నకిలీ కాదనే కండిషన్‌తో మార్చుకోవచ్చు.

అయితే మతపరమైన లేదా రాజకీయ నినాదాలు రాసి ఉన్న నోట్లను మాత్రం మార్చుకోవడం సాధ్యం కాదు. కో-ఆపరేటివ్ బ్యాంకు శాఖలు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల్లో చిరిగిన నోట్లను లేదా రంగులు అంటిన నోట్లను మార్చులేరు. ఆర్బీఐ రూల్స్, 2009 ప్రకారం దెబ్బతిన్న, చిరిగిన లేదా టేప్ చేయబడిన లేదా చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఏ బ్యాంకు నిరాకరించదు. ఈ నేపథ్యంలో మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆర్బీఐ నిమయాలు ఉన్నాయి.

 RBI’s big decision on currency notes: mutilated notes exchange

నిరంతరం వినియోగించడం వల్ల చెదిరిన లేదా మురికిగా మారిన నోటు లేదా టేప్ అంటించిన కరెన్సీ నోటును సాయిల్డ్ కరెన్సీ అంటారు. రంగు మారటం, చిల్లులు పడటం, పసుపు రంగులోకి మారడం లేదా మురికిగా మారడం జరుగుతుంది. ఈ నోట్లను మార్చుకోవచ్చు.

నకిలీ నోటు కాకుండా, శుభ్రంగా ఉండి, దాని వ్యాల్యూని నిర్ధారించే వీలు ఉంటే, పునర్ వినియోగానికి అనుకూలంగా ఉంటే దానిని ఫిట్ నోట్‌గా పరిగణిస్తారు. పునర్వినియోగానికి అనువుగా లేని లేదా ఆర్బీఐ రద్దు చేసిన నోట్లను పనికి రాని నోటుగా చెబుతారు.

కరెన్సీ నోట్ల ఫేస్ వ్యాల్యూ, వాటిపై చెదరని ఫీచర్స్ లేదా లేబుల్స్ ఆధారంగా ఒక నోటు మార్పిడికి ఎంత చెల్లించాలనే దానిని నిర్ధారిస్తారు. 109.56 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణం కలిగిన రూ.2000 నోటును తీసుకుంటే 44 చదరపు సెంటీమీటర్లు కలిగిన రూ.2000 నోటుకు రూ.1000 రీఫండ్ వస్తుంది. 88 చదరపు సెంటిమీటర్ల నోటును పూర్తి వ్యాల్యూతో మార్చుకోవచ్చు.

చిరిగిన రూ.200 బ్యాంకు నోటులో 78 చదరపు సెంటీమీటర్ల భాగానికి మొత్తం వ్యాల్యూను అందిస్తారు. అదే 39 చదరపు సెంటీమీటర్ల నోటుకు రూ.100 చెల్లిస్తారు. కాలిపోయిన లేదా పెళుసుగా మారిన నోటును మార్చుకోవడం కుదరదు. ఉద్దేశ్యపూర్వకంగా చించిన లేదా కత్తిరించిన నోట్లను తీసుకోరు.

English summary

RBI's decision on currency notes: కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం | RBI’s big decision on currency notes: mutilated notes exchange

The RBI has now taken important steps to ensure that currency notes last longer. Damaged, torn and discolored currency notes will now undergo a fitness test.
Story first published: Tuesday, July 5, 2022, 22:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X