For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI: మరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. ఎంత పెంచిందంటే..!

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటును పెంచింది. వరుసగా ఐదోసారి రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చింది. ఇది గతంలో పెంచిన దాని కంటే తక్కువని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. ఆర్బీఐలో గతంలో మూడు సార్లు 50 bps పెచ్చింది. రెపో రేటు పెంపుతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు పెంచ అవకాశం ఉంది. వడ్డీ రేట్ పెరిగితే రుణగ్రహీతల ఈఎంఐ పెరగనుంది.

10 సార్లు

10 సార్లు

దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ఏప్రిల్‌లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా 10 సార్లు రెపో రేటును యథాతథంగా ఉంచింది. అయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ రెపో రేటును తక్షణమే 40 బేసిస్ పాయింట్లు పెంచింది.

50 బేసిస్ పాయింట్లు

50 బేసిస్ పాయింట్లు

ఆ తర్వాత జూన్‌లో ఆర్‌బీఐ మళ్లీ రెపో రేటును పెంచింది. జూన్‌లో ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది. ఆగస్టులో మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. తరువాత, సెప్టెంబర్‌లో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచారు.

బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు

బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు

రెపో రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోని వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. కమర్షియల్ బ్యాంకులు నిధుల కొరత ఏర్పడినప్పుడు RBI నుండి నిధులను తీసుకుంటాయి. ఇది ఈ డబ్బుకు వడ్డీ రేటు. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం డిసెంబర్ 5 నుండి 7 వరకు జరిగింది.

నిపుణులు ఏమనుకున్నారు?

నిపుణులు ఏమనుకున్నారు?

అక్టోబర్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 7.41 శాతం నుంచి 6.77 శాతానికి తగ్గింది. కానీ డిసెంబర్‌లో జరిగే ఆర్‌బీఐ సమావేశం తర్వాత సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. డిసెంబరులో జరిగే సమావేశం తర్వాత ఈ రేటు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు.

English summary

RBI: మరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. ఎంత పెంచిందంటే..! | RBI once again hiked the repo rate by 0.35 percent

The Reserve Bank of India has once again increased the repo rate. For the fifth time in a row, the repo rate has been increased by 35 basis points to 6.25 percent.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X