For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI Monetary Policy: రెపోరేటు 4 శాతం వద్ద స్థిరంగా కొనసాగింపు

|

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికంతదాస్ ఎంపీసీ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఆర్బీఐ ఎంపీసీ ఏకగ్రీవంగా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ప్రస్తుతం రెపో రేటు 4 శాతం వద్ద ఉంది. అలాగే, లిక్విడిటీని నిర్ధారించడానికి రివర్స్ రెపో రేటును స్వల్పంగా పెంచారు. కరోనా ముందుస్థాయికి లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం (LAF) కారిడార్‌ను 50 బేసిస్ పాయింట్లకు పునరుద్ధరించడానికి ఆర్బీఐ నిర్ణయించింది. ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటును 4.25 శాతం వద్ద స్థిరంగా కొనసాగించింది.

RBI Monetary Policy: RBI MPC keeps repo rate unchanged at 4 percent unanimously

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఫెడ్ వడ్డీ రేటును అతి స్వల్పంగా పెంచింది. 50 బేసిస్ పాయింట్లు పెంచుతుందని భావించినప్పటికీ, 25 బేసిస్ పాయింట్లు మాత్రమే పెంచింది. అయితే రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్భణ ఆందోళనలు సహా వివిధ అంశాల ప్రభావంతో వడ్డీ రేట్లను ఆర్బీఐ స్థిరంగా కొనసాగించవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

English summary

RBI Monetary Policy: రెపోరేటు 4 శాతం వద్ద స్థిరంగా కొనసాగింపు | RBI Monetary Policy: RBI MPC keeps repo rate unchanged at 4 percent unanimously

MPC voted unanimously to leave the repo rate unchanged at 4 percent. MPC also voted unanimously to keep stance accommodative. Reverse repo rate hiked to ensure liquidity.
Story first published: Friday, April 8, 2022, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X