For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా ఆరోసారి.. మరోసారి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం

|

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమన పరిస్థితులు ఉన్నాయి. దేశంలోనూ అదే పరిస్థితులు ఉన్నాయి. వినిమయం, డిమాండ్ లేకపోవడం, ఉత్పత్తి తగ్గిపోయి వివిధ కంపెనీల ప్లాంట్లు మూసివేస్తున్నాయచి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గిస్తారని భావిస్తున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ 26 త్రైమాసికాల కనిష్ఠస్థాయికి పడిపోయిన నేపథ్యంలో గురువారం నాడు ప్రకటించనున్న పరపతి సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరో పావు శాతం కోత విధించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇప్పుడు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇలా తగ్గించడం ఆరోసారి అవుతుంది.

RBI monetary policy panel likely to slash repo rate for sixth time

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ వడ్డీరేట్లను 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంకులు మాత్రం 29 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గించాయి. ఇటీవల కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలు పెట్టుబడులకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. అంతేకాకుండా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, FDI నిబంధనలు మరింత సరళతరం చేయడం, నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకోసం ప్రత్యేక ప్యాకేజీ వంటి నిర్ణయాలు వృద్ధికి ఊతమిస్తున్నాయి.

English summary

వరుసగా ఆరోసారి.. మరోసారి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం | RBI monetary policy panel likely to slash repo rate for sixth time

RBI has cut interest rates on every single occasion the MPC has met since Das took over as the governor of RBI in last December.
Story first published: Thursday, December 5, 2019, 10:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X