For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథం... కారణం ఇదే..

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఈసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ (MPC) ఈ నెల 29వ తేదీ నుండి మూడు రోజుల పాటు సమీక్షించనుంది. అక్టోబర్ 1న ఎంపీసీ తన నిర్ణయాలను వెలువరిస్తుంది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచవచ్చు. క్రితం ఎంపీసీలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫిబ్రవరి నుండి వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ద్రవ్యోల్భణం అదుపుకు క్రితంసారి వడ్డీ రేట్లను తగ్గించలేదు. ఈసారి కూడా అలాగే ఉంచే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్భణం అదుపులోకి వచ్చే సూచనలు కనిపించే వరకు ఎలాంటి కోతలు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

RBI likely to keep interest rates unchanged in upcoming MPC

గత ఏడాది ఆర్థిక మందగమనం, ఈసారి కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. కరోనా కారణంగా ఈసారి అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఫిబ్రవరి నుండి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది. ద్రవ్యోల్భణం నేపథ్యంలో క్రితంసారి వడ్డీ రేట్లు తగ్గించలేదు.

English summary

ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథం... కారణం ఇదే.. | RBI likely to keep interest rates unchanged in upcoming MPC

The monetary policy committee (MPC) may stand pat on the policy repo rate as the August 2020 retail inflation reading of 6.69 per cent was above its upper tolerance level of 6 per cent.
Story first published: Sunday, September 27, 2020, 21:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X