For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loan moratorium: త్వరలో రుణపునర్వ్యవస్థీకరణ గైడ్‌లైన్స్

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నేడో రేపో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్చి నుండి ఆగస్ట్ వరకు రుణ మారటోరియం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రుణ పునర్వ్యవస్థీకరణ చేయనున్నాయి. ఇందుకు సంబంధించి ఆర్థికపరమైన పారామితులను త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

రిలయన్స్, ఇన్ఫోసిస్ సహా 8 కంపెనీల రూ.1.11 లక్షల కోట్లు ఆవిరి, నిలబడిన టీసీఎస్రిలయన్స్, ఇన్ఫోసిస్ సహా 8 కంపెనీల రూ.1.11 లక్షల కోట్లు ఆవిరి, నిలబడిన టీసీఎస్

సీఎన్‌బీసీ అవాజ్‌కు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వన్ టైమ్ రుణ పునర్నిర్మాణం కింద బ్యాంకులు లోన్ మారటోరియంను మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా 12 నెలల వరకు పొడిగించవచ్చునని తెలిపారు. కరోనా నేపథ్యంలో రుణగ్రహీతలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా తొలుత మార్చి నుండి మే వరకు మొదటిసారి లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత దానిని మరో మూడు నెలలు పొడిగించండతో ఆగస్ట్ 31 వరకు వెసులుబాటు దక్కింది.

RBI likely to announce one time loan restructuring guidelines soon

కరోనా నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న కంపెనీలకు వన్ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణకు అనుమతించిన ఆర్బీఐ, రుణాలు చెల్లించని వారిని ప్రస్తుతం ఎన్పీఏలుగా ప్రకటించవద్దని స్పష్టం చేసింది. 1 మార్చి 2020 నాటికి 30 రోజులకు మించకుండా రుణ ఖాతాలు కలిగిన కంపెనీలు వ్యక్తులు రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులు.

English summary

Loan moratorium: త్వరలో రుణపునర్వ్యవస్థీకరణ గైడ్‌లైన్స్ | RBI likely to announce one time loan restructuring guidelines soon

The RBI is likely to announce the financial parameters to be factored in the resolution plans under its proposed loan restructuring scheme to bail out Covid-hit companies soon.
Story first published: Monday, September 7, 2020, 8:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X