For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిటల్ కరెన్సీపై త్వరలో ఆర్బీఐ కీలక ప్రకటన

|

డిజిటల్ కరెన్సీ మోడల్ పైన అంతర్గత కమిటీ వర్క్ చేస్తోందని, త్వరలో ఓ నిర్ణయం ఉంటుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో తెలిపారు. డిజిటల్ కరెన్సీపై ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ గతంలో ప్రకటన చేసిందని గుర్తు చేశారు. అంతర్గత కమిటీ కసరత్తు పూర్తవగానే త్వరలో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకు సొంతగా డిజిటల్ కరెన్సీ తీసుకు వచ్చే ఆలోచన చేస్తుంది.

ప్రయివేటు క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తామని ప్రభుత్వం గతవారం సంకేతాలు ఇచ్చింది. డిజిటల్ కరెన్సీకి సంబంధించి తాము ఇప్పటికే డాక్యుమెంట్ విడుదల చేశామని, ఆర్బీఐలో డిజిటల్ కరెన్సీ పైన వర్క్ జరుగుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు తెలిపారు.

RBI internal panel working on model of central banks digital currency

ప్రపంచవ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా ప్రయివేటు డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీ, క్రిప్టోకరెన్సీకి ఆదరణ పెరుగుతోంది. వీటిపై నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయని, వీటితో పొంచి ఉన్న రిస్క్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary

డిజిటల్ కరెన్సీపై త్వరలో ఆర్బీఐ కీలక ప్రకటన | RBI internal panel working on model of central bank's digital currency

An internal committee within the RBI is taking a close look at the model of the central bank’s digital currency and will come out with its decision “very soon”, Deputy Governor B P Kanungo said on Friday.
Story first published: Friday, February 5, 2021, 21:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X