For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాస్టర్ కార్డ్ పై నిషేధం : కొత్త మాస్టర్ డెబిట్, క్రెడిట్ కార్డులకు బ్రేక్ .. అమలవుతున్న ఆర్బీఐ

|

ప్రముఖ పేమెంట్ గేట్ వే మాస్టర్ కార్డు కు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ కార్డు ఈ నెల 22వ తేదీ నుండి కొత్త సంస్థలతో ఆర్థిక సేవలు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిషేధం తరువాత జూలై 22 నుండి యుఎస్ ఆధారిత మాస్టర్ కార్డ్ కొత్త డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల జారీ నిలుపుదల చేయబడింది. కొత్తగా భారతీయ కస్టమర్లను ఎవరినీ చేర్చుకోవద్దని మాస్టర్ కార్డ్ సంస్థకు ఆర్బీఐ గతంలోనే ఆదేశించింది.

హోం లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ చెయ్యాల్సిందే .. తప్పనిసరి కాకున్నా ప్రైవేట్ బ్యాంకుల బలవంతపు భీమాలు !!హోం లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ చెయ్యాల్సిందే .. తప్పనిసరి కాకున్నా ప్రైవేట్ బ్యాంకుల బలవంతపు భీమాలు !!

కొన్ని రోజుల క్రితం, డేటా నిల్వ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు సెంట్రల్ బ్యాంక్ మాస్టర్ కార్డ్ సంస్థను అడ్డుకుంది. దీంతో ప్రధాన చెల్లింపు వ్యవస్థ మాస్టర్ కార్డ్ ఆపరేటర్లు కొత్త దేశీయ కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించలేరు అని ఆర్బిఐ తెలిపింది. కార్డ్ హామీలను తిరిగి ప్రారంభించడానికి వీసా వంటి ప్రత్యామ్నాయాలతో జతకట్టాల్సిన పరిస్థితి ప్రైవేట్ బ్యాంకులకు వచ్చింది. కొత్తగా తీసుకునే డొమెస్టిక్ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కస్టమర్లకు మూడింటికి ఈ ఆంక్షలు వర్తించనున్నట్లుగా తెలుస్తుంది.

MasterCard

చెల్లింపు సమాచారం నిల్వకు సంబంధించిన నిబంధనలను మాస్టర్ కార్డ్ ఉల్లంఘించిన కారణంగా ఆర్బిఐ చర్యలకు దిగింది. ఇక ప్రస్తుతం జారీ చేసిన మాస్టర్ కార్డ్ కస్టమర్ల విషయంలో మాత్రం యధాతథంగా తమ సర్వీసులను కొనసాగించవచ్చని ఆర్బిఐ పేర్కొంది.ఈ చర్య దేశంలో ప్రస్తుతం ఉన్న మాస్టర్ కార్డ్ హోల్డర్ల సేవలను ప్రభావితం చేయదని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుత కస్టమర్లు ఈ చర్య ద్వారా ప్రభావితం కానప్పటికీ, ఆఫర్‌లో ఉన్న సుమారు 100 డెబిట్ కార్డులలో మూడవ వంతు మాస్టర్ కార్డ్ ఉన్నందున బ్యాంక్ సేవలు దెబ్బతినే అవకాశం ఉంది.

అదనంగా, 75 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ వేరియంట్లు దాని నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నాయని సమాచారం.వీసా వంటి ప్రత్యామ్నాయాలతో బ్యాంకులు కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయవలసి ఉన్నందున ఈ చర్య బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని బ్యాంకింగ్ అధికారులు సూచించారు. ఈ ప్రక్రియకు బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌కు దాదాపు ఐదు నెలల సమయం పట్టవచ్చని అంచనా.

English summary

మాస్టర్ కార్డ్ పై నిషేధం : కొత్త మాస్టర్ డెబిట్, క్రెడిట్ కార్డులకు బ్రేక్ .. అమలవుతున్న ఆర్బీఐ | RBI decision in force..Break for new Master Debit and Credit Cards with ban on MasterCard

The Reserve Bank of India (RBI) has given a major shock to MasterCard, a leading US payment operator. The RBI imposed a ban on the issuance of master new cards. Restrictions on the issuance of Master New cards have been in force since yesterday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X