For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఆకాశ'తో కొత్త రంగంలోకి ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

|

ప్రముఖ ఇన్వెస్టర్ రాకేషన్ ఝున్‌ఝున్‌వాలా కొత్తగా చౌకధరల విమానయాన సంస్థను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. విమానాలలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరగవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న నాలుగేళ్లలో 70 విమానాలను సమకూర్చుకొని భావిస్తున్నారు రాకేష్. కొత్త సంస్థలో ఆయన రూ.260 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నారు. ఇందులో ఇండిగో మాజీ చీఫ్ ఆదిత్య ఘోష్ కూడా పెట్టుబడులు పెట్టనున్నారు.

రానున్న కాలంలో విమానయానం పెరుగుతుందని భావిస్తూ చౌకధరల విమానయాన సంస్థ ఆకాశా ఎయిర్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందుకునాలుగేళ్లలో 70 విమానాలను సమకూర్చుకుంటామన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కంపెనీలో 35 మిలియన్ డాలర్లు (రూ.260 కోట్లు) పెట్టుబడితో 40 శాతం వాటా తీసుకుంటున్నట్లు చెప్పారు.

 Rakesh Jhunjhunwala to start new airline Akasa

తమ ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చే పదిహేను రోజుల్లో వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 180 మందివరకు ప్రయాణించగల విమానాల కోసం డెల్టా ఎయిర్‌లైన్స్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌తో సహా తమ బృందం అన్వేషిస్తుందన్నారు. ఫోర్బ్స్ కుబేరుల జాబితా ప్రకారం రాకేష్ సంపద రూ.34,200 కోట్లుగా ఉంది.

English summary

'ఆకాశ'తో కొత్త రంగంలోకి ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా | Rakesh Jhunjhunwala to start new airline Akasa

A startup airline funded by billionaire investor Rakesh Jhunjhunwala and piloted by aviation veteran Vinay Dube could take to the skies by late this year or early next.
Story first published: Thursday, July 29, 2021, 9:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X