For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకాశ ఎయిర్ ఫ్లైట్ ఫస్ట్‌లుక్: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా విమానాలు మరి

|

ముంబై: దేశంలో స్టార్ ఇన్వెస్టర్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది- రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. స్టాక్ మార్కెట్‌ జ్యోతిష్యుడిగా ఆయనకు పేరుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వందల కోట్ల రూపాయలను ఆర్జించారాయన. ఇదివరకు ఇన్సూరెన్స్ సెగ్మెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. విమానయాన రంగంలోనూ అడుగు పెట్టారు. ఆకాశ ఎయిర్‌ పేరుతో విమానయాన సంస్థను నెలకొల్పారు.

దీనిపై కిందటి సంవత్సరమే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరమే ఆకాశ ఎయిర్‌ విమానాలు రెక్కలు విప్పుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆకాశ విమానాలు గాల్లోకి ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా దీని మీద అప్‌డేట్స్ ఇచ్చిందా కంపెనీ మేనేజ్‌మెంట్. ఆకాశ ఫ్లైట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫ్లైట్ ఫొటోలను తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఆకాశ ఎయిర్ సంస్థకు గత ఏడాది ఆగస్టులో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను నడిపించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఈ సంవత్సరం జులైలో ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి క్యూపీ అనే డిజిగ్నేటెడ్ కోడ్‌ లభించింది.

Rakesh Jhunjhunwala backed Akasa Air unveiled the picture of its first aircraft

ప్రతి పౌర విమానయాన సంస్థకూ డిజిగ్నేటెడ్ కోడ్ ఉండటం సహజం. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు 6ఈ, గో ఫస్ట్‌కు జీ8, ఎయిరిండియాకు ఏఐ అనేది కోడ్ నంబర్. అలాగే ఆకాశ ఎయిర్‌కు క్యూపీ అనే కోడ్ లభించింది. వినయ్ దుబే ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఆగస్టులో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించాలని భావించినప్పటికీ.. నిర్ణీత గడువు కంటే ముందే అంటే జులైలోనే వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని వినయ్ దుబే అన్నారు.

English summary

ఆకాశ ఎయిర్ ఫ్లైట్ ఫస్ట్‌లుక్: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా విమానాలు మరి | Rakesh Jhunjhunwala backed Akasa Air unveiled the picture of its first aircraft

Ace investor Rakesh Jhunjhunwala-backed Akasa Air has tweeted picture of its first aircraft. Akasa Air tweeted sharing the pic of the aircraft.
Story first published: Monday, May 23, 2022, 14:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X