For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వేలో రూ.100కు రూ.98.44 ఖర్చే, ఆ ఆదాయం లేకుంటే 102.66%

|

న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఆదాయంలో 98.44 శాతం ఖర్చులు అయ్యాయి. గత పదేళ్లలో ఇది అత్యంత వరస్ట్ ఆపరేటింగ్ రేషియో కావడం గమనార్హం. ఈ మేరకు CAG సోమవారం పార్లమెంటులో నివేదికను సమర్పించింది. రైల్వే ఎంత సమర్థవంతంగా పని చేస్తోంది, దాని ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది నిర్వహణ, నిష్పత్తి ద్వారా తెలుస్తుంది.

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుతో రూ.760 కోట్లు: రేపటి నుంచే..ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుతో రూ.760 కోట్లు: రేపటి నుంచే..

రూ.100కు రూ.98.44 ఖర్చు

రూ.100కు రూ.98.44 ఖర్చు

ఇప్పుడు (2017-18) ఇది 98.44 శాతంగా ఉన్నదంటే రూ.100 ఆదాయం కోసం రూ.98.44 ఖర్చు చేసినట్లు. గతంలో 2000-01లో నిర్వహణ నిష్పత్తి అత్యంత తక్కువగా 98.3 శాతంగా నమోదయింది. మరుసటి ఏడాది 96% చేరుకుంది. ప్యాసింజర్ సర్వీసులు, ఇతర కోచింగ్ సర్వీసుల నిర్వహణ వ్యయాలను రైల్వే అందుకోలేకపోతోందని CAG తన నివేదికలో తెలిపింది.

ఆ లాభమంతా ఇక్కడ ఖర్చు

ఆ లాభమంతా ఇక్కడ ఖర్చు

సరుకు రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 95% శాతాన్ని ప్యాసింజర్ సర్వీసులతో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వెచ్చిస్తున్నట్లు తెలిపింది. రాయితీ టికెట్లు, రాయితీ పాస్‌లు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్స్ వంటివి నష్టాలకు ఓ కారణంగా పేర్కొంది. రాయితీ వదులుకునేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన Give-Up స్కీంకు సీనియర్ సిటిజన్స్ నుంచి అంతగా స్పందన లేదని కూడా తెలిపింది.

ఆదాయం పెంచుకోవాలి

ఆదాయం పెంచుకోవాలి

అలాగే, ఏసీ క్లాస్‌లలో ప్రయాణించే అన్ని కేటగిరీల రాయితీలకు చెందిన ప్రయాణికుల వార్షిక పెరుగుదల రేటు నాన్ ఏసీ క్లాస్‌ల కంటే అధికంగా ఉన్నట్లు కాగ్ తెలిపింది. వెంటనే ఆదాయాన్ని పెంచుకునే చర్యలు చేపట్టాలని సూచనలు చేసింది. రైల్వేస్ రూ.100 సంపాదించడానికి రూ.98.44 ఖర్చు చేసినట్లు.

అడ్వాన్స్ లేకుంటే షాకింగ్.. ఆపరేటింగ్ రేషియో 102.66 శాతం

అడ్వాన్స్ లేకుంటే షాకింగ్.. ఆపరేటింగ్ రేషియో 102.66 శాతం

దీంతో 2017-18లో రూ.5,676.20 కోట్ల లోటులో ఇండియన్ రైల్వే ఉండవలసి ఉందని, కానీ NTPC, IRCON నుంచి అందిన అడ్వాన్స్‌లతో రూ.1,665.61 కోట్ల మిగులు సాధ్యమైందని కాగ్ నివేదిక తెలిపింది. ఒకవేళ ఈ అడ్వాన్స్ లేకుంటే ఆపరేటింగ్ రేషియో 102.66 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. నెట్ రెవెన్యూ సర్‌ప్లస్ 2016-17లో రూ.4,913 కోట్లు ఉండగా, 2017-18 నాటికి 66 శాతం తగ్గి రూ.1,665.61 కోట్లుగా ఉందని పేర్కొంది.

రూ.88,064 కోట్ల ఆదాయం

రూ.88,064 కోట్ల ఆదాయం

2015 నుంచి 2018 మధ్య ఇండియన్ రైల్వేస్‌కు 190 కోట్ల రిజర్వ్డ్ ప్యాసింజర్స్ ద్వారా రూ.88,064 కోట్ల ఆదాయం వచ్చింది. అదే సమయంలో రిజర్వ్డ్ ప్రయాణీకుల రాయితీ రూ.7,418 కోట్లు (8.42 శాతం) నుంచి రూ.21.75 కోట్లు (11.45)గా ఉంది.

English summary

రైల్వేలో రూ.100కు రూ.98.44 ఖర్చే, ఆ ఆదాయం లేకుంటే 102.66% | Railways operating ratio of 98.44 percent in 2017-18, worst in last 10 years

The Indian Railways recorded its worst operating ratio in 10 years in 2017-18 at 98.44%, the CAG said in a report tabled in Parliament.
Story first published: Tuesday, December 3, 2019, 9:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X