For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Railway News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్ ప్రక్రియలో భారీ మార్పులు.. మీరూ తెలుసుకోండి..

|

Railway News: రైలు ప్రయాణికులకు తిప్పలు తప్పనున్నాయి. ఎందుకంటే.. టిక్కెట్ల బుక్కింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ మరో ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం..

టిక్కెట్ బుక్కింగ్ లో మార్పులు..

టిక్కెట్ బుక్కింగ్ లో మార్పులు..

రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంట్ కమిటీకి అందజేసింది. దీని ప్రకారం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రస్తుతం ఉన్న PRS వ్యవస్థపై అధ్యయనం చేస్తోంది. దాని అప్‌గ్రేడేషన్‌ను సూచించడానికి ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ని నియమించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని రైల్వే స్టాండింగ్ కమిటీ సమర్పించిన 'భారతీయ రైల్వేల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్' అనే నివేదికలో దీనికి సంబంధించిన విషయాలు వెల్లడించారు.

నకిలీలకు చెక్ పెట్టేందుకు..

నకిలీలకు చెక్ పెట్టేందుకు..

2019-20లో IRCTC వెబ్‌సైట్/యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసిన రిజర్వేషన్ టిక్కెట్లు, వాస్తవ రిజర్వేషన్ సెంటర్ సైట్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్‌ల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కమిటీ పేర్కొంది. అయితే.. ఈ వెబ్‌సైట్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో దీని ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ-టికెటింగ్ సౌకర్యం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా రైల్వే కౌంటర్లలో రద్దీని తగ్గించడంలో, నకిలీ నోట్లు రైల్వేలకు రాకుండా చేయటంలో సహాయం చేస్తుందని కమిటీ వెల్లడించింది.

టిక్కెట్ల సంఖ్య పెంపు..

టిక్కెట్ల సంఖ్య పెంపు..

IRCTC వెబ్‌సైట్/సర్వర్‌ల సామర్థ్యాన్ని మరింత పటిష్ఠంగా నిర్వహించడం కోసం, వాటిని మరింత పటిష్టంగా ఉండేలా క్రమం తప్పకుండా బలోపేతం చేయడం, అప్‌గ్రేడ్ చేయడం అవసరమని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఆన్‌లైన్ టికెటింగ్‌ను బలోపేతం చేయడానికి 2014లో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తన సమాధానంలో కమిటీకి తెలిపింది. డిసెంబర్ 2021 నాటికి భారతీయ రైల్వే ఈ-టికెటింగ్ కింద మొత్తం రిజర్వ్ చేసిన టిక్కెట్ల వాటా 80.5 శాతానికి చేరుకుంది.

కోట్ల మంది యూజర్లు..

కోట్ల మంది యూజర్లు..

IRCTCకి 100 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. అందులో 760 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ప్రస్తుత వ్యవస్థను మరింతగా వేగవంతం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో నివేదించేందుకు కేంద్రం ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌కు బాధ్యతలు అప్పగించింది.

రైల్వే లెక్కల ప్రకారం..

రైల్వే లెక్కల ప్రకారం..

రైల్వే మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 2016-17లో భారతీయ రైల్వేలలో మొత్తం రిజర్వ్ చేసిన టిక్కెట్లలో e-టికెట్ల వాటా 59.9 శాతం, 2016-17లో మొత్తం రిజర్వ్ చేసిన టిక్కెట్లలో e-టికెట్ల వాటా 65.8 శాతం, 2018-19లో 70.1 శాతం, 2019-20లో 72.8 శాతం, 2020-21లో 79.6 శాతం, 2020-21 & 2021-22 సంవత్సరాల్లో డిసెంబర్ నెల వరకు 80.5 శాతంగా నమోదైంది. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింతగా పెరగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

Railway News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్ ప్రక్రియలో భారీ మార్పులు.. మీరూ తెలుసుకోండి.. | railway ministry planning to upgrade Railway Passenger Reservation System a committee appointed for this

The Existing Mechanism Is Being Studied For The Upgradation Of The Railway Passenger Reservation System
Story first published: Thursday, August 11, 2022, 12:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X