For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4,000 రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలు, నెలకు రూ.10 నుండి రూ.70 ఛార్జీ

|

ఇండియన్ రైల్వేకు చెందిన బ్రాడ్ బ్యాండ్, వీపీఎన్ సర్వీసెస్ కంపెనీ రైల్ టెల్ దేశంలోని నాలుగువేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. OTP ఆధారిత ధృవీకరణతో ఎవరైనా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.

NPS నుండి పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు: ఎంత, ఎలా, ఎన్నిసార్లు?NPS నుండి పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు: ఎంత, ఎలా, ఎన్నిసార్లు?

ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్రీపెయిడ్ ప్లాన్స్

తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం ప్రయాణీకులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైని 1 Mbps వేగంతో ఉపయోగించుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ వేగవంతమైన లేదా 34Mbps వేగం వరకు ఇంటర్నెట్ కోసం కస్టమర్లు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5GB డేటా ఛార్జీ రూ.10, 10GBకి రూ.15 ఛార్జీ, ఐదు రోజుల వ్యాలిడిటీతో 10GBకి రూ.50 ఉంది. 30 రోజుల కాలపరిమితితో కూడిన 60GBకి రూ.70 ఛార్జీ ఉంటుంది.

ఇలా కొనుగోలు చేయవచ్చు

ఇలా కొనుగోలు చేయవచ్చు

రిపోర్ట్స్ ప్రకారం నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్రెడిట్ కార్డు ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. రైల్వే స్టేషన్లను డిజిటల్ వేదికగా మార్చాలనే ఉద్దేశ్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న (కేటగిరీ 1), సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్, రైల్ టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, హైస్పీడ్ వైఫైని అందిస్తున్నాయి.

ఏడాదికి ఆదాయం ఎంతంటే

ఏడాదికి ఆదాయం ఎంతంటే

కరోనా సమయంలో ఇక్కడ 2.9 కోట్ల మందికి పైగా దీనిని ఉపయోగించుకున్నారు. కరోనా నుండి పరిస్థితులు క్రమంగా మెరుగు పడుతున్నందున పెయిడ్ వైఫై నుండి ఏడాదికి రూ.10 కోట్ల నుండి రూ.15 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లోని 20 రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై ట్రయల్ నిర్వహించారు. అనంతరం 4000 స్టేషన్లలో లాంచ్ చేస్తున్నారు.

English summary

4,000 రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలు, నెలకు రూ.10 నుండి రూ.70 ఛార్జీ | RailTel Launches Prepaid WiFi At 4,000 Railway Stations

On Thursday, Railway PSU RailTel formally launched its paid wi-fi service plans which will enable users to access high-speed internet at 4,000 railway stations across the country.
Story first published: Friday, March 5, 2021, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X