For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

covid-19 లాక్‌డౌన్: సంపద కూడబెట్టిన ఏకైక భారతీయుడు డి-మార్ట్ రాధాకిషన్ ధమానీ

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కుబేరులు తమ ఆస్తులను కోల్పోతున్నారు. ముఖేష్ అంబానీ నుండి జెఫ్ బెజోస్ వరకు ఈ రెండు నెలల కాలంలో పెద్ద ఎత్తున నష్టపోయారు. అయితే ఇదే కాలంలో సూపర్ మార్కెట్ బిలియనీర్ల సంపద మాత్రం భారీగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో గత పదిహేను రోజులుగా లాక్ డొన్ కొనసాగుతోంది. మరో వారం రోజులు ఉండటంతో పాటు దీనిని కేంద్ర ప్రభుత్వం కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఈ కొద్ది రోజుల్లోనే సూపర్ మార్కెట్ ఓనర్ల సంపద పెరిగింది.

డీ-మార్ట్ రాధాకిషన్ దమానీ గురించి మరిన్ని కథనాలు

12మంది ధనికుల్లో ధమానీ ఆస్తులు మాత్రమే పెరిగాయి

12మంది ధనికుల్లో ధమానీ ఆస్తులు మాత్రమే పెరిగాయి

అవెన్యూ సూపర్ మార్కెట్ డి మార్ట్ పేరుతో మార్కెట్ నిర్వహిస్తుంది. దీని ఓనర్ రాధాకిషన్ దమానీ అనే విషయం తెలిసిందే. ఈయన ఆస్తులు ఈ ఏడాది 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఈ కాలంలో సంపదను రాబట్టుకున్న 12 మంది ధనికులైన భారతీయుల్లో ధమానీ ఒక్కరే నిలిచారు.

18 శాతం ఎగబాకిన షేర్లు

18 శాతం ఎగబాకిన షేర్లు

ధమానీ నేతృత్వంలోని అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు ఈ ఏడాది 18 శాతం ఎగబాకాయి. కరోనా కారణంగా ముఖేష్ అంబానీ, ఉదయ్ కొటక్ వంటి వారి సంపద దాదాపు 30 శాతం మేర కోల్పోయారు. కానీ రాధాకిషన్ ధమానీ మాత్రం భారీగా సంపాదించారు. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు భారీగా క్షీణిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పానిక్ కొనుగోళ్లు.. భారీగా పెరిగిన సంపద

పానిక్ కొనుగోళ్లు.. భారీగా పెరిగిన సంపద

గత నెలలో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం, ఎంతకాలం కొనసాగుతుంది, పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళనతో ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాలు కొనుగోలు చేశారు. డీమార్ట్ వంటి సూపర్ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. సాధారణంగానే ప్రస్తుతం నిత్యావసరాల ఉపయోగమే ఉంది కాబట్టి అవెన్యూ ఆస్తులు పెరుగుతాయి. కానీ ప్రజల భయంతో మరింత ఎక్కువగా కొనుగోలు చేయడం మరింత కలిసి వచ్చింది.

లాక్ డౌన్ ఎత్తివేసినా తిరుగులేదు

లాక్ డౌన్ ఎత్తివేసినా తిరుగులేదు

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత.. పానిక్ కొనుగోళ్లు తగ్గిన తర్వాత.. కూడా డిమార్ట్‌కు తిరుగులేదు. ఎందుకంటే డిమార్ట్‌లో తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఇది డిమార్ట్‌కు పెద్ద అసెట్. ప్రకటనల ఖర్చు లేకుండా, నేరుగా ఉత్పత్తిదారుల నుండే కొనుగోలు చేస్తూ.. డిమార్ట్ తన కస్టమర్లకు తక్కువ ధరకు వస్తువులను అందిస్తుంది.

ప్రత్యర్థి కంపెనీలకు లేని ప్రయోజనం

ప్రత్యర్థి కంపెనీలకు లేని ప్రయోజనం

ప్రస్తుత పరిస్థితుల్లో డి మార్ట్ లభపడినప్పటికీ, ప్రత్యర్థి కంపెనీలు మాత్రం అంతగా ప్రయోజనం పొందలేకపోయాయి. ఇండియా సెకండ్ లార్జెస్ట్ రిటైల్ చైన్ ఫ్యూచర్ గ్రూప్‌కు 1300 స్టోర్స్ ఉన్నాయి. ఉదాహరణకు అవెన్యూ సూపర్ మార్ట్స్ నేడు (ఏప్రిల్ 8) 5 శాతం లాభపడింది. ఫ్యూచర్ గ్రూప్ 3 శాతం నష్టపోయింది. లాక్ డౌన్ పొడిగిస్తే డిమార్ట్‌లో ఉత్పత్తులు ఖాళీ అయ్యే అవకాశాలు ఉండొచ్చు.

కస్టమర్ల డిమాండుకు అనుగుణంగా..

కస్టమర్ల డిమాండుకు అనుగుణంగా..

అయితే డిమార్ట్ ఉత్పత్తులు సూపర్ మార్కెట్లలో పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత క్రైసిస్‌లో చిన్న, మధ్యస్థ వ్యాపారులను పక్కన పెడితే కస్టమర్లకు నిత్యావసరాలు అందించే రిటైలర్లు తక్కువగా ఉన్నారు. డిమార్ట్ తమ నగదు ప్రవాహాన్ని సప్లై చైన్‌లో సరైన పద్ధతిలో పెట్టుబడులు పెడుతోందని చెబుతున్నారు. తద్వారా వినియోగదారుల డిమాండుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.

English summary

covid-19 లాక్‌డౌన్: సంపద కూడబెట్టిన ఏకైక భారతీయుడు డి-మార్ట్ రాధాకిషన్ ధమానీ | Radhakishan Damani's wealth surges under lockdown

The only Indian tycoon whose net worth is unscathed as the deadly coronavirus roils markets worldwide can thank nation’s hoarders with millions scrambling to stock up on staples amid the world’s biggest isolation effort.
Story first published: Wednesday, April 8, 2020, 20:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X