For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో క్వాల్‌కామ్ రెండో అతిపెద్ద కార్యాలయం, 8700 ఉద్యోగాలు

|

సాఫ్టువేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాల్‌కామ్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆఫీస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అమెరికాలోని శాండియాగోలో క్వాల్‌కామ్ ప్రధాన కార్యాలయంలో సీఎఫ్ఓ ఆకాశ్ పాలీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్ జిన్, లక్ష్మీ రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్‌సింగ్ తదితర కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో క్వాల్‌కామ్ సహా మూడు ప్రధాన కంపెనీలు భారీ పెట్టుబడులను ప్రకటించాయి. ఇందులో భాగంగా క్వాల్‌కామ్ హైదరాబాద్‌లో వచ్చే అయిదేళ్ళలో రూ.3,904.55 కోట్ల పెట్టుబడితో రెండో అతిపెద్ద సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే క్యాంపస్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి ఇది పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో దాదాపు 8700 మందికి ఉపాధి కల్పిస్తారు.

Qualcomm setting up its second biggest campus in Hyderabad, to employ 8,700 people

15 లక్షల 72వేల చదరపు అడుగుల వైశాల్యం గల కార్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పెట్టుబడికి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్ నాటికి హైదరాబాద్‌లో తమ కేంద్రం సిద్ధమవుతుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ప్రపంచంలోనే అతిపెద్ద రెండో క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపిన కేటీఆర్, ఈ వరుసలో క్వాల్‌కామ్ చేరడంపై హర్షం వ్యక్తం చేశారు.

English summary

హైదరాబాద్‌లో క్వాల్‌కామ్ రెండో అతిపెద్ద కార్యాలయం, 8700 ఉద్యోగాలు | Qualcomm setting up its second biggest campus in Hyderabad, to employ 8,700 people

It is almost a windfall for Telangana with massive investments being announced by three major companies including Qualcomm during the visit of the IT minister KT Rama Rao to the United States.
Story first published: Wednesday, March 23, 2022, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X