For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

KYC: మీకు ఆ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే మీకు ఇదే చివరి అవకాశం..!

|

దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదాలకు ఓ విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులందరూ నో-యువర్-కస్టమర్ (KYC) సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ బ్యాంక్ కు కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. కేవైసీ అప్డేడ్ చేయుకుంటే ఖాతా మూసివేస్తామని హెచ్చరించింది. కేవైసీకి డిసెంబర్ 12, 2022 వరకు గడువు ఉందని బ్యాంక్ తెలిపింది.

SMS, ఇమెయిల్

SMS, ఇమెయిల్

బ్యాంకు ఈ సమాచారాన్ని SMS, ఇమెయిల్, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ఖాతాదారలుక తెలియజేసింది. మీరు బీఎన్బీ బ్యాంక్ ఖాతాదారులైతే.. ఇంకా కేవైసీ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. " RBI మార్గదర్శకాల ప్రకారం KYC అప్‌డేషన్ తప్పనిసరి. కానీ KYC అప్‌డేట్ కోసం కస్టమర్ల వ్యక్తిగత సమాచారం కోసం బ్యాంక్ ఫోన్ చేయదు" అని PNB ఒక ట్వీట్‌లో పేర్కొంది. KYC అప్‌డేషన్‌ను పూర్తి చేయడానికి బ్రాంచ్ కు వెళ్లాలని సూచించింది.

ఆర్బీఐ

ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల ఖాతాలలో KYCని అప్‌డేట్ చేయమని దేశంలోని అన్ని బ్యాంకులకు ఎప్పటికప్పుడు ఆర్డర్ చేస్తూనే ఉంటుంది. ఈ కారణంగా, కస్టమర్లందరికీ ఈ పనిని పూర్తి చేయడం ఇప్పుడు తప్పనిసరి అయింది. అటువంటి పరిస్థితిలో, PNB తన ఖాతాదారులు KYCని అప్‌డేట్ చేయమని కోరుతోంది.

మీ KYC పెండింగ్‌లో ఉందో లేదో తనిఖీ చేయడం ఎలా?

మీ KYC పెండింగ్‌లో ఉందో లేదో తనిఖీ చేయడం ఎలా?

KYC అప్‌డేట్ చేయబడిందో లేదో తెలుసుకోవాలనుకునే వారు 1800 180 2222/ 1800 103 2222 (టోల్-ఫ్రీ)/ 0120-2490000 (టోల్ చేసిన నంబర్)లో కస్టమర్ కేర్ సర్వీస్‌ను సంప్రదించవచ్చు. ఇదిలావుండగా ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సెప్టెంబర్ త్రైమాసికానికి మొండి బకాయిల కోసం అధిక కేటాయింపుల కారణంగా స్వతంత్ర నికర లాభం 63 శాతం క్షీణించి రూ. 411 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.1,105 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

English summary

KYC: మీకు ఆ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే మీకు ఇదే చివరి అవకాశం..! | Punjab National Bank customers should update KYC by December 12

Punjab National Bank, the country's second largest bank, has appealed to its customers. All customers are required to update Know-Your-Customer (KYC) information.
Story first published: Wednesday, December 7, 2022, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X