For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆక్సీమీటర్ల ధరలు డబుల్, డిమాండ్ పెరగడంతో రెండింతలైన ధర

|

శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని గుర్తించి అప్రమత్తంగా ఉండేందుకు ప్రస్తుతం చాలామంది తమ ఇళ్లలో ఆక్సీమీటర్ ఉపయోగిస్తున్నారు. కరోనా తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల నుండి ఆక్సీమీటర్‌కు భారీ డిమాండ్ వచ్చింది. దీంతో పలువురు వ్యాపారులు ఆక్సీమీటర్‌ను అధిక ధరకు విక్రయిస్తున్నారు. గత ఏడాది కరోనాకు ముందు మార్కెట్లో దీని ధర రూ.900 నుండి ప్రారంభమైంది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆక్సీమీటర్ రెండింతలు పలుకుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.1500 నుండి రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. ఆక్సీమీటర్లు మార్కెట్లో సరిపడా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇంట్లో థర్మామీటర్, మల్టీ విటమిన్ ట్యాబ్లె్లతో పాటు పల్స్ ఆక్సీమీటర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వ్యాపారులు వీటి ధరలను పెంచుతున్నారు.

Pulse oximeters, oxygen concentrators prices surge by up to 100 percent

అంతేకాదు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను కొనుగోలు చేసేందుకు రూ.1 లక్ష వరకు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నెటిజన్లు. ఇవి అంతకుముందు రూ.45,000 వరకు ఉండేవి. ఈ డివైస్ నెల రెంట్ రూ.5000 నుండి రూ.20,000 వరకు ఉంది.

English summary

ఆక్సీమీటర్ల ధరలు డబుల్, డిమాండ్ పెరగడంతో రెండింతలైన ధర | Pulse oximeters, oxygen concentrators prices surge by up to 100 percent

Customers are beginning to feel the pinch of the surging second wave of coronavirus infections as prices of pulse oximeters, oxygen concentrators, vaporizers, and nebulisers have jumped sharply up to 100 per cent in the last 10 days, with a massive demand-supply gap amid the local lockdowns.
Story first published: Thursday, April 29, 2021, 21:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X