కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అన్ని దేశాలు వణికిపోతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పందించారు. కరోనా-లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది పేదరికంలోకి నెట్టబడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇతర దేశాలతో పోలిస్తే మనం త్వరగా కోలుకుంటాం
మిగతా దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త త్వరగా కోలుకుంటుందని దువ్వూరి సుబ్బారావు అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వృద్ధి రేటు తగ్గుతుందని, అయితే మూలధనం అలాగే ఉందని, ఫ్యాక్టరీలు, దుకాణాలు నిలదొక్కుకొనే ఉన్నాయన్నారు. లాక్ డౌన్ ఎత్తివేయగానే పనులకు వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని, దీంతో రికవరీ త్వరగా ఉంటుందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన అవకాశాలు మన దేశానికి ఉంటాయని చెప్పారు.

కోట్లాదిమంది పేదరికంలోకి..
ప్రస్తుత లాక్ డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తే మాత్రం కోట్లాదిమంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని సుబ్బారావు హెచ్చరించారు. మిగతా దేశాలతో పోలిస్తే వేగంగా కోలుకుంటుందని సంబరపడవద్దని, మనది చాలా పేద దేశమని, లాక్ డౌన్‌ను సాధ్యమైనంత త్వరగా ఎత్తివేయాలన్నారు. లేదంటే పరిస్థితులు చేయి దాటిపోతాయన్నారు.
3

వృద్ధి రేటు తక్కువే.. వీ ఆకారంలో కోలుకుంటాం
ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు చాలామంది విశ్లేషకులు చెబుతున్న విధంగా సున్నా స్థాయికి తగ్గడం లేదా ప్రతికూలంగా ఉండే అవకాశమే ఉందని సుబ్బారావు చెప్పారు. కరోనాకు ముందే మందగమనం కారణంగా ఆర్థిక వృద్ధి కుదేలయిందని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ వీ ఆకారంలో కోలుకుంటుందని చెప్పారు. తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల తరహాలో కరోనా కారణంగా మన మూలధన ఆస్తులు ధ్వంసం కాలేదన్నారు. ఫ్యాక్టరీలు, దుకాణాలూ యథాతథంగా ఉన్నాయని, కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇంగ్లీషు అక్షరం వీ ఆకారంలో కోలుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

రుణాల చెల్లింపుకు పథకం
కరోనా కారణంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ఇచ్చే రుణాల చెల్లింపుకు పరపతి హామీ పథకం లాంటిది ప్రవేశ పెట్టాలని మాజీ డిప్యూటీ గవర్నర్ థోరట్ సూచించారు. లేకపోతే ఈ సంస్థలకు మరిన్ని నిధులు సమకూర్చాలని సూచించారు. వీటిలో ఏదో ఒకటి చేయాలని సూచన చేశారు. మొండి బకాయిల భయంతో అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ముందుకు రావడం లేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు మరింత ఆర్థిక మద్దతు ఉండాలన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications