For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 నెలల్లో ఆదాయం, ఖర్చులు పెరుగుతాయి: ఉద్యోగుల్లో సరికొత్త విశ్వాసం

|

భారతదేశంలో ఉద్యోగులు/ప్రొఫెషనల్స్ ఆదాయం, పొదుపుకు సంబంధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు లింక్డిన్ సర్వేలో వెల్లడైంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యక్తులు, సంస్థల ఆదాయంపై ప్రభావం చూపుతోంది. అయితే తాజా సర్వేలో ఉద్యోగులు కాస్త ఆశాజనకంగా ఉన్నారు. వచ్చే ఆరు నెలల్లో తమ ఆదాయం, ఖర్చులు పెరుగుతాయని ప్రతి నలుగురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. జూన్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దేశంలోని 1,351 మందిని సర్వే చేశారు. భవిష్యత్తు పైన, ముందు ముందు ఆర్థిక పరిస్థితిపై ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడింట రెండొంతుల గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్లు లేవు, ఉద్యోగ అవకాశాల కోసం ఇలా..మూడింట రెండొంతుల గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్లు లేవు, ఉద్యోగ అవకాశాల కోసం ఇలా..

గత సర్వే కంటే బెటర్

గత సర్వే కంటే బెటర్

కరోనా మహమ్మారి కారణంగా అంతకుముందు మే 4వ తేదీ నుండి 17వ తేదీ వరకు చేసిన సర్వే కంటే తాజా సర్వేలో ఉద్యోగుల్లో భద్రతా భావం పెరిగింది. ఆదాయం, మిగులుపై సానుకూలంగా కనిపించారు. మొదటి సర్వేలో 1,464 మంది పాల్గొన్నారు. 20 శాతం మంది తమ ఆదాయం పెరుగుతుందని చెప్పగా, 27 శాతం మంది మిగులు, 23 శాతం మంది ఖర్చులు పెరుగుతాయన్నారు. తాజా సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు ఆదాయం పెరుగుతుందని, తమ ఖర్చులు పెరుగుతాయని అంచనా వేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ మిగులు, వ్యక్తిగత రికరింగ్ అప్పుల చెల్లింపు పెరుగుతుందని అంచనా వేశారు.

స్వల్పకాలిక, దీర్ఘకాలిక యాజమాన్య విశ్వాసం

స్వల్పకాలిక, దీర్ఘకాలిక యాజమాన్య విశ్వాసం

స్వల్పకాలిక యాజమాన్య విశ్వాసం విషయానికి వస్తే 50 శాతం కార్పోరేట్ సేవ ప్రొఫెషనల్స్, 46 శాతం ఉత్పాదక ప్రొఫెషనల్స్, 41 శాతం ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్... తమ కంపెనీలు ఇప్పటి కంటే ఆరు నెలల తర్వాత మరింత మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు.దీర్ఘకాలిక యాజమాన్య విశ్వాసం విషయానికి సంబంధించి 64 శాతం మ్యానుఫ్యాక్చరింగ్, 60 శాతం కార్పోరేట్ సర్వీసెస్, 59 శాతం సాఫ్టువేర్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్... తమ కంపెనీల భవిష్యత్తు ఏడాది తర్వాత బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ ఆఫీస్

వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ ఆఫీస్

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ 38 శాతం జెన్ ఎక్స్ (40 ఏళ్ల నుండి 54 ఏళ్లు), 29 శాతం మంది బేబీ బూమర్స్ (55 ఏళ్లకు మించి) అనుమతిస్తే కంపెనీలకు వచ్చి పని చేయాలని భావిస్తున్నారు. జెన్ జెడ్ (25 ఏళ్ల లోపు), మిలీనియల్స్‌లో (25 నుండి 39 ఏళ్లు) ప్రతి ఒక్కరిలో ఒకరు ఇంటి నుండి పని సురక్షితంగా భావిస్తున్నారు. ప్రయాణం, భోజనం సమయంలో నిర్లక్ష్యంగా ఉండే కొందరితో ప్రమాదం ఉందని 55 శాతం మంది చెప్పారు.

English summary

6 నెలల్లో ఆదాయం, ఖర్చులు పెరుగుతాయి: ఉద్యోగుల్లో సరికొత్త విశ్వాసం | Professionals in India now slightly upbeat about income: survey

Professionals in India are slightly more upbeat now about their income and savings as 1 in 4 respondents expect their earned income and personal spending to increase in the next six months, according to a LinkedIn survey.
Story first published: Tuesday, June 30, 2020, 18:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X