For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

upi payments: నగదు ట్రాన్స్ ఫర్‌ లో పొరపాటు జరిగిందా ? ఇలా తిరిగి పొందండి..

|

upi payments: ఎవరికైనా నగదు బదిలీ చేయాలంటే గతంలో బ్యాంకులకు వెళ్లేవారు. ప్రస్తుతం పెరుగిన సాంకేతికత ద్వారా ఇంటి నుంచే డబ్బు ట్రాన్స్‌ ఫర్‌ లు జరుపుతున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌ లైన్‌ చెల్లింపులు భారీగా పెరిగాయని చెప్పక తప్పదు. దుకాణాల్లో కొనుగోళ్ల దగ్గర నుంచి వ్యక్తులకు నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులన్నీ దీని ద్వారానే జరుగుతున్నాయి.

పొరపాటు జరిగిందా ?
బ్యాంకు ఖాతాలతో లింక్ అయ్యి ఉండటం వల్ల యూపీఐ ద్వారా చెల్లింపులు చాలా సురక్షితం. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపించేశారనుకో, అప్పుడు ఏమి చేయాలి ? ఎవరిని సంప్రదించాలి ? బదిలీ అయిన నగదు తిరిగి వస్తుందా ? వంటి అనేక ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. వాటికి సమాధానాలేంటో చూద్దాం..

Procedure to get back money from wrong transfers

ఇలా చేయండి..
సరైన చర్యలు తీసుకోవడం ద్వారా పొరపాటుగా బదిలీ చేసిన నగదు మొత్తాన్ని తిరిగి పొందవచ్చని ఆర్బీఐ చెబుతోంది. డిజిటల్ లావాదేవీల విషయంలో.. మొదటగా చెల్లింపు వ్యవస్థ ద్వారా బాధితుడు ఫిర్యాదు చేయాలని సూచించింది. అంటే పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే వంటి యాప్‌ లు వినియోగిస్తే.. ఆయా కస్టమర్ సర్వీస్ కు జరిగిన విషయం గురించి వివరించి నగదు వాపసు కోరవచ్చని పేర్కొంది. సమస్యను పరిష్కరించడంలో వారు విఫలమైతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చని వెల్లడించింది

English summary

upi payments: నగదు ట్రాన్స్ ఫర్‌ లో పొరపాటు జరిగిందా ? ఇలా తిరిగి పొందండి.. | Procedure to get back money from wrong transfers

Actions to get back wrongly sent money through upi
Story first published: Sunday, January 22, 2023, 14:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X