గ్రాసరీస్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం బిగ్ బాస్కెట్ డేటా చోరీకి గురైంది. ఈ మేరకు సైబర్ ఇంటెలిజెన్స్ సిబెల్ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం ఓ ఫార్మా కంపెనీలోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. తాజాగా బిగ్ బాస్కెట్‌లో డేటా చౌర్యం జరగడం గమనార్హం. సైబర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం 2 కోట్ల మందికి పైగా వినియోగారుల వివరాలు చోరీకి గురయ్యాయి. దీనికి సంబంధించి బెంగళూరు సైబర్ సెల్‌లో కంపెనీ ఫిర్యాదును అందించింది. డేటా చోరీకి సంబంధించి సైబర్ నిపుణులు రంగంలోకి దిగారు.

రూ.30 లక్షలకు డేటా చోరీ
బిగ్ బాస్కెట్ డేటాను చోరీ చేసిన హ్యాకర్లు వాటిని దాదాపు రూ.30 లక్షలకు విక్రయానికి పెట్టినట్లుగా కూడా సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. డార్క్ వెంబ్ పరిశీలనలో భాగంగా బిగ్ బాస్కెట్ డేటా చోరీని తమ పరిశోధన బృందం గుర్తించిందని, ఈ వివరాలను దాదాపు రూ.30 లక్షలకు అమ్మకానికి పెట్టారని, రెండు కోట్ల మంది కస్టమర్లతో కూడిన ఎస్‌క్యూఎల్ ఫైల్ పరిమాణం దాదాపు 15GB ఉందని సిబెల్ తెలిపింది. ఇందులో ఈ-మెయిల్ ఐడీలు, మొబైల్ నెంబర్లు, అడ్రస్‌లు, పుట్టిన తేదీ, ఐపీ అఢ్రస్ ఉన్నట్లు తెలిపింది. డేటా చోరీ అక్టోబర్ 30వ తేదీన జరిగినట్లు గుర్తించినట్లు సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని బిగ్ బాస్కెట్‌కు వెంటనే తెలియజేసినట్లు వెల్లడించింది.

ఆ వివరాల్లేవు.. క్రెడిట్ కార్డు డేటాకు ముప్పులేదు
బిగ్ బాస్కెట్ కస్టమర్లకు కూడా హామీ ఇచ్చింది. కస్టమర్ల గోప్యత, భద్రత తమకు చాలా ముఖ్యమని, క్రెడిట్ కార్డు నెంబర్లు సహా ఎలాంటి ఆర్థిక వివరాలను భద్రపరచడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. తమ దగ్గర క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు ఉండవని, కాబట్టి ఆ డేటాకు సంబంధించి ముప్పు లేదని తెలిపింది. డేటా చౌర్యాన్ని కట్టడి చేయడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కలిసి పని చేస్తున్నామని కూడా బిగ్ బాస్కెట్ తెలిపింది. అలాగే బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించింది.

15 రోజుల తర్వాత గుర్తింపు
తమ డేటాలో కస్టమర్లకు సంబంధించిన ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు, ఆర్డర్ వివరాలు, చిరునామాలు మాత్రమే ఉంటాయని బిగ్ బాస్కెట్ తెలిపింది. డేటా చౌర్యం అక్టోబర్ 14వ తేదీన జరిగిందని, పదిహేను రోజుల తర్వాత గుర్తించినట్లు తెలిపింది. డేటా చౌర్యాన్ని గుర్తించడంతో నవంబర్ 1వ తేదీన బెంగళూరు బిగ్ బాస్కెట్ ప్రధాన కార్యాలయానికి తెలిపింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications