For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

budget 2023: విపక్షాలకు బడ్జెట్ రుచించిందా ? ఎవరి అభిప్రాయమేంటి..?

|

budget 2023: వివిధ అంచనాల నడుమ కేంద్ర వార్షిక బడ్జెట్‌ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వేతన జీవులకు పన్ను స్లాబుల్లో కొంత ఊరట మినహా చెప్పుకోదగ్గ అంశాలేవీ బడ్జెట్ లో లేవని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. వైఫల్యాలు, హామీల అమలులో పురోగతి వంటి వాటిని ప్రస్తావించలేదని విమర్శలకు దిగారు. అయితే ఈ దఫా బడ్జెట్‌ పై.. దేశంలోని వివిధ రాజకీయ ప్రముఖులు ఏమంటున్నారో చూద్దాం..

దేశ భవిష్యత్తు కోసం రోడ్‌మ్యాప్ లేదు: రాహుల్ గాంధీ

మిత్ర కాల్ బడ్జెట్‌ ఇది అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉద్యోగాలను సృష్టించే దృక్పథం లేదు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళిక లేదు, అసమానతలు తగ్గించే ఉద్దేశం లేదన్నారు. 1 శాతం సంపన్నులు చేతిలో 40 శాతం సంపద ఉండగా.. 50 శాతం పేదలు 64 శాతం GST కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం యువతకు నిరుద్యోగులుగా మిగిలినా PM పట్టించుకోవడం లేదన్నారు. మెరుగైన ఇండియా భవిష్యత్తు నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ఎటువంటి రోడ్‌మ్యాప్ లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తుందన్నారు.

అరగంట టైం ఇవ్వండి, బడ్జెట్‌ను ఎలా రెడీ చేయాలో చూపిస్తాను: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

అరగంట టైం ఇవ్వండి, బడ్జెట్‌ను ఎలా రెడీ చేయాలో చూపిస్తాను: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కేంద్ర బడ్జెట్‌ను "ప్రజలకు వ్యతిరేకం"గా అభివర్ణించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పూర్తిగా అవకాశవాద, ప్రజా వ్యతిరేక, పేదలను నీరుగార్చే బడ్జెట్ అని విమర్శించారు. ఒక వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇది తయారు చేశారని దుయ్యబట్టారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పుల వల్ల ఒరిగేది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. ఇది చీకటి బడ్జెట్ అని, అరగంట సమయం ఇస్తే పేదల కోసం బడ్జెట్‌ ఎలా తయారు చేయాలో చూపిస్తానని సవాలు విసిరారు.

ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఈ బడ్జెట్‌లో ద్రవ్యోల్బణం నుంచి ఎలాంటి ఉపశమనం లేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. అందుకు విరుద్ధంగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరుద్యోగాన్ని తొలగించేందుకు పక్కా ప్రణాళిక లేదని విమర్శించారు. బడ్జెట్‌ లో విద్యారంగం కేటాయింపులను 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు.

పార్టీకి బదులు దేశం కోసం బడ్జెట్‌ రూపొందించాల్సింది : బీఎస్పీ అధినేత్రి మాయావతి

పార్టీ కోసం కాకుండా దేశం కోసం బడ్జెట్ రూపొందించాలని BSP అధినేత్రి మాయావతి చురకలంటించారు. ఓ పథకం లబ్ధిదారుల గురించి మాట్లాడినప్పుడు.. 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, రైతులతో కూడిన విశాలమైన దేశమని గుర్తుంచుకోవాలన్నారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని మరింత పెంచుతుంది : ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్

దాదాపు దశాబ్ద కాలంగా ప్రజలకు ఏమీ ఇచ్చింది ఇప్పుడు ఇవ్వడానికి అన్నట్లు అఖిలేష్ యాదవ్ విమర్శంచారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని మరింత పెంచుతుందన్నారు. రైతులు, శ్రామికులు, యువకులు, మహిళలు, ఉద్యోగ నిపుణులు, వ్యాపార వర్గానికి ఎటువంటి ఆశ లేదన్నారు. కొంతమంది పెద్దలకు మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

మళ్లీ దారిద్య్ర స్థాయికి దిగువకే : PDP అధినేత్రి మెహబూబా ముఫ్తీ

మళ్లీ దారిద్య్ర స్థాయికి దిగువకే : PDP అధినేత్రి మెహబూబా ముఫ్తీ

గత ఏళ్లుగా వస్తున్న బడ్జెట్‌ మాదిరిగానే ఈసారి కూడా ఉన్నట్లు PDP అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. పన్నులు పెరిగాయి కానీ సంక్షేమ పథకాలు & సబ్సిడీలపై ఖర్చు తగ్గిందన్నారు. పన్నుల ఆదాయం వల్ల ప్రజలు ప్రయోజనం పొందాలి కానీ అది వారి నడ్డి విరిచేదిగా ఉండరాదన్నారు. సామాన్యులకు లబ్ది చేకూర్చడానికి బదులు సంక్షేమ పథకాలు, సబ్సిడీలను రద్దు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికాన్ని దాటి పైకి ఎదిగిన ప్రజలు మరోసారి దారిద్య్ర స్థాయికి పడిపోయారన్నారు.

అప్పుడూ, ఇప్పుడూ పంజాబ్ ప్రస్తావనే లేదు : పంజాబ్ సీఎం భగవంత్ మాన్

అప్పుడూ, ఇప్పుడూ పంజాబ్ ప్రస్తావనే లేదు : పంజాబ్ సీఎం భగవంత్ మాన్

ఇంతకుముందు గణతంత్ర దినోత్సవంలో పంజాబ్ ను విస్మరించారు, ఇప్పుడు బడ్జెట్ నుంచి తప్పించారని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల BSF అప్‌ గ్రేడేషన్, ఆధునీకరణ, యాంటీ డ్రోన్ సిస్టమ్ కోసం మేము వెయ్యి కోట్లు డిమాండ్ చేసాము, కానీ బడ్జెట్‌లో ఎటువంటి ప్రకటనా రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో నీటిపారుదలకు అదనపు నిధులను అందజేస్తున్నప్పటికీ.. తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వక పోవడాన్ని తప్పుపట్టారు. కేంద్రం సవతి తల్లిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కాలం గడిపేసే అలవాటు పోలేదు : బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, అందరికీ ఇళ్లు ఇస్తాం, 80 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తాం అని 2014లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని తేజస్వీ యాదవ్ గుర్తు చేశారు. 2023 కూడా వచ్చింది కానీ వారికి రేపు, మాపు అంటూ గడిపే అలవాటు మాత్రం పోలేదన్నారు. బీజేపీకి 100% ఎంపీలను ఇచ్చిన బీహార్‌ను బడ్జెట్‌లో మరోసారి కేంద్రం మోసం చేసిందని విమర్శించారు.

కిరాణా దుకాణం బిల్లు: సుబ్రమణ్యస్వామి

ఇది ఈ రోజు సమర్పించిన బడ్జెట్‌నా? కిరాణా దుకాణదారుడి బిల్లులా ఉంది అని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. మంచి బడ్జెట్‌లో ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటో వెల్లడించాలి. GDP పెరుగుతూ ఉంటే వృద్ధి రేటు ఎలా ఉండబోతుందో చెప్పాలి. పెట్టుబడి & రాబడి రేటు, ప్రాధాన్యతలు, ఆర్థిక వ్యూహం, వనరుల సమీకరణలను వివరించాలి అన్నారు.

మోదీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేసింది: మల్లికార్జున్‌ ఖర్గే

ప్రతి ఇంట్లో ద్రవ్యోల్బణం ఉంది, సామాన్యుడు కష్టాల్లో ఉన్నాడు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే అంశం బడ్జెట్‌లో లేదు, పిండి, పప్పు, పాలు, వంటగ్యాస్ ధరలు పెంచి దేశాన్ని లూటీ చేసింది మోడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.

కల్లాస్ బడ్జెట్ : మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం

కల్లాస్ బడ్జెట్ : మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం

మధ్య తరగతి ప్రజల గురించి ప్రభుత్వం విస్మరించిందని చిదంబరం విమర్శించారు. పన్ను విధానంలో ఉపశమనం ఇచ్చినా, అది కేవలం కొత్త రెజీమ్‌ లోకి మారిన వారికి మాత్రమే వర్తిస్తుందన్నారు. కానీ ఆ లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజల ఆశయాలను పూర్తిగా తుంగలో తొక్కి, వచ్చే ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా బడ్జెట్ తయారు చేసిందని దుయ్యబట్టారు.

ఎవరి కోసం ఆ ప్రకటనలు: కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనలపై జైరామ్ రమేష్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. గ్రీన్ హైడ్రోజన్‌, 50 కొత్త విమానాశ్రయాలు & హెలిపోర్ట్‌లు, తీరప్రాంత షిప్పింగ్‌, హార్టికల్చర్‌, ధాన్యం నిల్వల కోసం ఆర్థిక మంత్రి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. మరి మీకొక క్విజ్ అంటూ ప్రశ్నను సంధించారు.

క్విజ్ ప్రశ్న: రాజకీయంగా శక్తివంతమైన ఏ గ్రూపు ఈ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది లేదా చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది ?

 పాత హామీలను కప్పిపుచ్చడమే : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కమల్ నాథ్

పాత హామీలను కప్పిపుచ్చడమే : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కమల్ నాథ్

ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం.. పాత వాగ్దానాలను 'జుమ్లా'లతో కప్పిపుచ్చే ప్రయత్నమేనని కమల్ నాథ్ అభిప్రాయపడ్డారు. 2022 నాటికి పూర్తి చేస్తామన్న హామీలపై ఏమీ మాట్లాడలేదని, అందుకు కారణం చెప్పలేదు దేశ ప్రజలకు క్షమాపణా చెప్పలేదని విమర్శించారు. ఈ ధోరణి దేశానికి, ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు.

 ఫ్యాన్సీ ప్రకటనలు మాత్రమే : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్

ఫ్యాన్సీ ప్రకటనలు మాత్రమే : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్

దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలకు సంబంధించిన నిజాన్ని ఈ బడ్జెట్ ప్రస్తావించ లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటితో పాటు ఇంతకుముందు చేసినవి కూడా ఫాన్సీ ప్రకటనలు మాత్రమేనని, వాటి అమలు మాటేమిటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా బీమా కంపెనీలు మాత్రమే ప్రయోజనం పొందాయని విమర్శించారు.

నిరుత్సాహపరిచే బడ్జెట్ : సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్

నిరుత్సాహపరిచే బడ్జెట్ : సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే సమర్పించిన బడ్జెట్ ఇది అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ విమర్శించారు. మధ్యతరగతి వారికి కొంత సడలింపు ఇచ్చినా.. రైతులు, యువతకు ఉపాధి, MSP గురించి ప్రభుత్వం ఏమీ చెప్పలేదన్నారు. రైల్వేలను సైతం పట్టించుకోలేదని, మొత్తంగా ఇది నిరుత్సాహపరిచే బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు.

 నిరుత్సాహపరిచే బడ్జెట్ : డీఎంకే ఎంపీ దయానిధి మారన్

నిరుత్సాహపరిచే బడ్జెట్ : డీఎంకే ఎంపీ దయానిధి మారన్

బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు. రాష్ట్రాలకు ప్రకటించిన పథకాలు సైతం మీ పాట్లు మీరు పడండి అనే విధంగానే ఉన్నాయని విమర్శించారు.

ఇది మోడీజీకి అమృత్ కాల్: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

2014 నుంచి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేస్తున్న ప్రకటనలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. పంటల MSP పెరగలేదు, యువతకు ఉపాధి లభించలేదని విమర్శించారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీకి 'అమృత్ కాల్' అని, దేశంలోని సామాన్య ప్రజలకు కాదని అన్నారు. తలసరి ఆదాయం రెట్టింపు అయింది అని ఆర్థిక మంత్రి అంటున్నారు, కానీ ఎవరిది అని ప్రశ్నించారు.

ప్రతి వర్గాన్నీ స్పృశించింది: లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్

ప్రతి వర్గాన్నీ స్పృశించింది: లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌ను లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎంపీ చిరాగ్ పాశ్వాన్ స్వాగతించారు. సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమాన్ని స్పృసించిందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా.. కేంద్రం సమర్పించిన బడ్జెట్‌ను నిజంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

షారూఖ్ ఖాన్ పఠాన్ అంత పెద్ద హిట్: బీఎస్పీ ఎంపీ మలూక్ నగర్

షారూఖ్ ఖాన్ పఠాన్ అంత పెద్ద హిట్: బీఎస్పీ ఎంపీ మలూక్ నగర్

సామాన్య ప్రజలకు మంజూరు చేసిన ఉపశమనం.. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా అంత హిట్ అయ్యిందని UPలోని బిజ్నోర్‌కు చెందిన ఎంపీ, బీఎస్పీ నాయకులు మలూక్ నగర్ ప్రశంసించారు.

English summary

budget 2023: విపక్షాలకు బడ్జెట్ రుచించిందా ? ఎవరి అభిప్రాయమేంటి..? | Political leaders comments on 2023 budget

Political leaders opinion on budget
Story first published: Thursday, February 2, 2023, 7:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X