For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మా జీవితాలు నాశనం, సాక్ష్యాలు ఇస్తాం: నీరవ్‌కి సోదరి పూర్వీ, బావ భారీ షాక్

|

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (PNB) రూ.వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి షాక్. బ్యాంకింగ్ రంగాన్ని PNB కుంభకోణం కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోడీ సోదరి పూర్వి మోడీ, ఆమె భర్త మయాంక్ మెహతా అప్రూవర్‍‌లుగా మారారు. నీరవ్ వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాధారాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇది నీరవ్‌కు ఊహించని భారీ షాక్.

SBI కొత్త రూల్: పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండిSBI కొత్త రూల్: పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి

నీరవ్ వల్ల మా జీవితం దుర్భలం

నీరవ్ వల్ల మా జీవితం దుర్భలం

పూర్వీ మోడీ, ఆమె భర్త మయాంక్ మెహతాలు అప్రూవర్లుగా మారేందుకు, ప్రాసిక్యూషన్ విట్‌నెస్‌కు ముంబై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కోర్టు జనవరి 5న ఆమోదం తెలిపింది. ఈ జంట గత నెలలో అప్రూవర్లుగా మారుతామంటూ కోర్టును ఆశ్రయించారు. నీరవ్ మోడీ కేసు నుండి తమకు సంబంధం లేదని, ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను అందిస్తామని కోర్టుకు తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. నీరవ్ పైన కేసుల వల్ల తమ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలు దుర్భరంగా మారినట్లు తెలిపారు. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో సాక్షులుగా పరిశీలించాలని కోరారు.

అప్రూవర్‌గా...

అప్రూవర్‌గా...

ఈ కేసులో పూర్వీ మోడీ క్షమాపణ కోరి, సాక్ష్యాలు అందించిన అనంతరం, అప్రూవర్‌గా పేర్కొనాలని కోర్టు జనవరి 6న ఆదేశాలు జారీ చేసింది. బెల్జియం పౌరసత్వం కలిగిన పూర్వీ ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం నిందితురాలు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ నిందితులు కోర్టు ముందు హాజరు కావాలని, ప్రాసిక్యూషన్ అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తాము దర్యాఫ్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పూర్వీ, మయాంక్ తమ ప్రకటనలో తెలిపారు.

పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు

పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు

దర్యాఫ్తు సంస్థ ప్రకారం నీరవ్ మోడీ, అతని మేనమామ మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14వేలకోట్లకు పైగా మోసం చేశారు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్నారు. నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక అపరాధిగా 2019లో ప్రకటించారు. అతనిని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

English summary

మా జీవితాలు నాశనం, సాక్ష్యాలు ఇస్తాం: నీరవ్‌కి సోదరి పూర్వీ, బావ భారీ షాక్ | PNB scam: Nirav Modi's sister, brother in law turn approver

Fugitive diamond merchant Nirav Modi's young sister and brother-in-law have turned approver in the Punjab National Bank (PNB) scam case.
Story first published: Wednesday, January 6, 2021, 18:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X