For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan Nidhi Samman Yojana:రైతులకు అలర్ట్.. ఈకేవైసీ చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు.. చివరి తేదీ ఎప్పుడంటే..

|

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 11 విడతలుగా డబ్బులు పంపిణీ చేసింది. అయితే 11వ విడతకు ముందు రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈకేవైసీ చేసుకున్న వారికే 11వ విడత డబ్బులు పడతాయని చెప్పింది. అయితే కొందరు రైతులకు దీనిపై సరైన అవగాహన లేక ఈకేవైసీ చేసుకోలేదు. దీంతో వారికి 11వ విడత నిధులు ఆగిపోయాయి. అయితే ఇప్పటికైనా ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం అన్నదాతలను కోరుతోంది. ఈకేవైసీ చేసుకోవాలంటే ఆధార్ తో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా అయితేనే ఈకేవైసీ చేసుకోవచ్చు.

ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే దగ్గరిలోని మీ సేవ కేంద్రాలకు వెళ్తే మొబైల్ నెంబర్ లింక్ చేస్తారు. అయితే మొబైల్ నెంబర్ లింక్ ఒక్క ఈ పథకానికే కాదు అనేక ఆర్థిక లావాదేవీలకు కూడా ఉపయోగపడుతుంది. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిన తర్వాత సింపుల్ గా ఈకేవైసీ చేసుకోవచ్చు. మీరు మీ స్మార్ట్ ఫోన్ లో https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx టైప్ చేయగానే ఓటీపీ బెస్ ఈకేవైసీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఈకైవైసీ పూర్తి అవుతుంది. ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 31 వరకు గడువు ఇచ్చింది.

PM Kisan eKYC Deadline Extended to July 31, Want Rs 6000 in a Year? How to Do eKYC Online

ఇక ఇప్పటికే 11వ విడత డబ్బులు వచ్చిన వారు https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx అని టైప్ చేస్తేబెనిఫిషరీ స్టేటస్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మొబైల్ నెంబర్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చ ఎంటర్ చేసి జెనరేట్ ఓటీపై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు డబ్బులు ఎప్పుడు పడ్డాయి. ఏ అకౌంట్ లో పడ్డాయో తెలుస్తుంది. అయితే ఈకేవైసీ తర్వాత మీ ఆధార్ ఎక్కడైతే లేటెస్ట్ గా అప్ డేట్ అవుతుందో ఆ బ్యాంకులోనే డబ్బులు పడతాయి.

English summary

PM Kisan Nidhi Samman Yojana:రైతులకు అలర్ట్.. ఈకేవైసీ చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు.. చివరి తేదీ ఎప్పుడంటే.. | PM Kisan eKYC Deadline Extended to July 31, Want Rs 6000 in a Year? How to Do eKYC Online

To receive the PM Kisan Nidhi Samman Yojana installment, beneficiary farmers have to complete their PM Kisan eKYC process in Online.
Story first published: Saturday, July 2, 2022, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X