For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan: రైతులకు శుభవార్త.. త్వరలో పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు.. eKYC ఉంటేనే..

|

రైతుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద ఇప్పటికే 11 విడతలుగా పైసలు జమా కాగా త్వరలో 12వ విడత డబ్బులు కూడా కూడా అన్నదాత ఖాతాల్లో పడనున్నాయి. అయితే ఈకేవైసీ చేసుకున్న వారికి డబ్బులు అకౌంట్లో పడనున్నాయి. అయితే 11వ విడతకు ముందే రైతులు ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం కోరింది.

ఆగస్టు 31 వరకు గడువు

ఆగస్టు 31 వరకు గడువు

అయినా కొంత మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదు. వారి కోసం జూలై 31 వ అవకాశం కల్పించారు. అయినా కొందరు రైతులు ఇంకా eKYC ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో eKYCని పూర్తి చేయడానికి ప్రభుత్వం గడువు పొడిగించింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం, పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ eKYC గడువు 31 ఆగస్టు 2022 వరకు పొడిగించింది.

2019

2019

2019లో రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ రూ. 6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమా చేస్తోంది. అంటే ప్రతి నాలుగు నెలలకు రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున వేస్తోంది.

eKYC తప్పనిసరి

eKYC తప్పనిసరి

అయితే ఈకేవైసీ పూర్తి కాక కొంత మంది రైతులకు 11వ విడత డబ్బులు రాలేదు. ఈకేవైసీ ఇప్పటికి పూర్తి చేయుకుంటే 12వ విడత డబ్బులు కూడా అందకుండాపోతాయి. అందుకే భూములున్న రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈకేవైసీ పూర్తి చేసిన వారికే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద డబ్బులు జమా చేస్తామని స్పష్టం చేసింది.

ఈకేవైసీ ఇలా సింపుల్ గా చేసుకోండి.

ఈకేవైసీ ఇలా సింపుల్ గా చేసుకోండి.

1.ముందుగా PMkisan.gov.in వెబ్‌సైట్ వెళ్లాలి.

2.అందులో ఫార్మర్ కార్నర్ ఉంటుంది.

3. ఫార్మర్ కార్నర్ లో మొదటి ఆప్షన్ eKYC ఉంటుంది.

4. eKYC పై క్లిక్ చేయాలి.

5.అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది

6.ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి

7.ఆ తర్వాత ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

8. మీ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఏటీపీ ఎంటర్ చేస్తే eKYC ప్రక్రియ పూర్తి అవుతుంది.

మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే..

eKYC ప్రక్రియ పూర్తి చేయాలంటే తప్పుకుండా ఫోన్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. ఆధార్ లింక్ లేకుంటే మీ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్ కు వెళ్లి ఆధార్ తో ఫోన్ నెంబర్ లింక్ చేయాలి. ఇందుకోసం వారు నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు.

Read more about: pm kisan farmers
English summary

PM Kisan: రైతులకు శుభవార్త.. త్వరలో పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు.. eKYC ఉంటేనే.. | PM Kisan 12th tranche money will be deposited in farmers' accounts soon.

The Center gave good news to the farmers. It said that PM Kisan funds will be deposited in farmers' accounts soon
Story first published: Saturday, August 27, 2022, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X