For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Buy Now Pay Later: భారత్‌పేను కోర్టుకు లాగిన ఫోన్‌పే

|

ప్రముఖ మొబైల్ పేమెంట్ యాప్ భారత్‌పే 'బై నౌ పే ల్యాటర్' అంటూ పోస్ట్‌పే యాప్‌ను ఇటీవల లాంచ్ చేసింది. పోస్ట్ పే బ్రాండ్ నేమ్ కాపీరైట్ వ్యవహారంలో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే బాంబే హైకోర్టు మెట్లు ఎక్కింది. రెసిలియంట్ ఇన్నోవేషన్స్‌కు చెందిన పోస్ట్‌పే యాప్‌లో Pe వినియోగంపై రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కును దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని కోరుతూ ఫోన్‌పే బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల ఆరో తేదీన పోస్ట్‌పే సేవలను భారత్ పే ప్రారంభించింది. ఈ విషయమై బాంబే హైకోర్టులో ఫోన్‌పే అభ్యర్థన పైన, కోర్టు అక్టోబర్ 22వ తేదీన విచారణకు స్వీకరించింది.

పోస్ట్‌పే ఫోన్‌పే ప్రత్యయాన్ని పోలి ఉందనే విషయాన్ని హైకోర్టు గమనించింది. అయితే కోర్టు చేసిన కొన్ని పరిశీలనలను పరిష్కరించడం కోసం పిటిషన్‌ను ఫోన్‌పే ఉపసంహరించుకున్నది. కాగా భారత్‌పే పై మరో దావాను వేసేందుకు సిద్దమైనట్లు కంపెనీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫోన్‌పే Pe ప్రత్యయం వినియోగంపై భారత్‌పేను కోర్టు లాగడం ఇదే మొదటిసారి కాదు. 2019లో సెప్టెంబర్ నెలలో ఫోన్‌పే ఇదే విధమైన నిషేధాన్ని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, అప్పుడు కోర్టు భారత్‌పే ట్రేడ్ మార్కును ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టుకు ఫోన్‌పే పిటిషన్‌ను తోసిపుచ్చింది.

PhonePe drags BharatPe to Bombay High Court over Pe suffix in PostPe

ఇదిలా ఉండగా, వాల్‍‌మార్ట్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంస్థ ఫోన్‌పే, ఫోన్ రీఛార్జీలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక వ్యాల్యూ కలిగిన మొబైల్ రీఛార్జీలపై ట్రాన్సాక్షన్స్‌కు రూ.1 నుండి రూ.2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జీ ట్రాన్సాక్షన్ UPI ద్వారా చేసినా, ప్రాసెసింగ్ ఛార్జీ భారం పడుతుంది. UPI ఆధారిత ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్ పేమెంట్స్ యాప్‌గా ఫోన్‌పే నిలిచింది. పోటీ సంస్థలు ఈ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీ వసూలు చేయడం లేదు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్‌పేతో పాటు ఇతర సంస్థలు ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తున్నాయి.

English summary

Buy Now Pay Later: భారత్‌పేను కోర్టుకు లాగిన ఫోన్‌పే | PhonePe drags BharatPe to Bombay High Court over Pe suffix in PostPe

In a continuing dispute between payments companies PhonePe and BharatPe on the usage of the ‘Pe’ suffix, PhonePe on October 22 said that it moved the Bombay High Court on the matter.
Story first published: Sunday, October 24, 2021, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X